Avocado For Hair: అవకాడోలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీర అంతర్భాగాలకే కాకుండా.. మన జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అవకాడోలో విటమిన్ ఇ, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా.. జుట్టును మృదువుగా, బలంగా మార్చడానికి సహాయపడతాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలకు అవకాడో ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అవకాడోతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు:
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: అవకాడోలోని విటమిన్ ఇ , బి విటమిన్లు జుట్టు కుదుళ్ళకు రక్త ప్రసరణను పెంచుతాయి. తద్వారా కొత్త జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
జుట్టును మృదువుగా చేస్తుంది: ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు సహజమైన కండిషనర్‌గా పనిచేస్తాయి. ఇది జుట్టు పొడిగా మారకుండా, మృదువుగా , నిగారింపుగా ఉండేలా చేస్తుంది.
చుండ్రును తగ్గిస్తుంది: అవకాడోలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు స్కాల్ప్‌పై ఉండే చికాకును, పొడిదనాన్ని తగ్గిస్తాయి.
జుట్టు రాలడం తగ్గిస్తుంది: అవకాడోలోని పోషకాలు జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
అవకాడోను జుట్టుకు ఎలా ఉపయోగించాలి ?
అవకాడోను జుట్టు సంరక్షణ కోసం కొన్ని రకాల హెయిర్ మాస్క్‌లుగా ఉపయోగించవచ్చు. ఇక్కడ కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి.
1. అవకాడో, తేనె హెయిర్ మాస్క్:
తేనెలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుతాయి.
కావలసినవి:
ఒక పండిన అవకాడో
ఒక టేబుల్ స్పూన్ తేనె
తయారీ: ఒక గిన్నెలో అవకాడోను మెత్తగా చేసి.. అందులో తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించండి. 20-30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టుకు మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.
2. అవకాడో, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్:
కొబ్బరి నూనె జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది.
కావలసినవి:
ఒక పండిన అవకాడో,
రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె
తయారీ: అవకాడోను మెత్తగా చేసి, అందులో కొబ్బరి నూనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.. ఒక గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
Also Read: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?
3. అవకాడో, పెరుగు హెయిర్ మాస్క్:
పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కావలసినవి:
ఒక పండిన అవకాడో
రెండు టేబుల్ స్పూన్ల పెరుగు.
తయారీ: అవకాడోను మెత్తగా చేసి పెరుగుతో కలపండి. ఈ మాస్క్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.
ఈ హెయిర్ మాస్క్‌లను వారానికి ఒకసారి వాడటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మీ జుట్టు ఆరోగ్యంగా.. బలంగా మారడానికి అవకాడో ఒక అద్భుతమైన పరిష్కారం. తక్కువ సమయంలోనే జుట్టు సంబంధిత సమస్యలు తగ్గాలంటే అవకాడో ఉపయోగంచడం ముఖ్యం.