BigTV English

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Salman Khan IPL Team RCB : సాధారణంగా క్రికెట్ కి.. బాలీవుడ్ కి మధ్య చాలా కాలం నుంచి మంచి అనుబంధం ఉంది. ఇక ఐపీఎల్ కూడా దీనిని మరింత బలోపేతం చేసింది. బాలీవుడ్ స్టార్స్ అయిన షారూఖ్ ఖాన్, ప్రీతి జింటా చాలా కాలం నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీలు కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జట్లకి యజమానులుగా ఉన్నారు. ఒకానొక సమయంలో శిల్పా శెట్టి కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకి భాగస్వామి గా ఉన్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభంలో ఓ జట్టును కొనుగోలు చేయాలని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భావించాడట. బీసీసీఐ కూడా కొనుగోలు చేయాలని సల్మాన్ ఖాన్ ని ఒత్తిడి చేసిందట. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం కొనుగోలు చేయలేదని తాజాగా వెల్లడించాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని సల్మాన్ ఖాన్ పేర్కొనడం గమనార్హం.


Also Read : Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

ఐపీఎల్ లో సల్మాన్ కి బంఫర్ ఆఫర్ 


ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ ను కూడా ఐపీఎల్ లో టీమ్ ఎందుకు కొనకూడదు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అతని సమాధానం ఆశ్చర్యపరిచింది. ముంబై లో జరిగిన ఓ కార్యక్రమంలో మీరు ఎప్పుడైనా ఐపీఎల్ లో టీమ్ కొనాలని అనుకున్నారా..?అని అడగ్గా.. దీనికి సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. ఐపీఎల్ కి మేము చాలా ముసలి వాళ్లం అయ్యామని నవ్వుతూ సమాధానం చెప్పడం విశేషం. కానీ ఈ ఏడాది సల్మాన్ ఖాన్ ఇండియన్ స్ట్రీల్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ ఫ్రాంచైజీ యజమానిగా మారారు. మరోవైపు ఐపీఎల్ తొలి సీజన్ 2008లోనే తాను ఒక జట్టుకు యజమానిగా మారే అవకాశం వచ్చిందని వెల్లడించాడు సల్మాన్ ఖాన్. కానీ ఆ ఆఫర్ ను తిరస్కరించినట్టు తెలిపారు. ఆ సమయంలోనే నాకు ఐపీఎల్ బంఫర్ వచ్చిందని.. కానీ నేను తీసుకోలేదు. దీని గురించి ఇప్పుడు నేను బాధ పడటం లేదు. సంతోషంగా ఉన్నానని సల్లూ భాయ్ చెప్పారు.

కేకేఆర్ లో షారూఖ్ వాటా అంతేనా..? 

సల్మాన్ ఖాన్ కి ఆఫర్ ఇచ్చింది మరే జట్టో కాదండోయ్.. 2025లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆఫర్ తొలుత సల్మాన్ ఖాన్ కే వచ్చింది. కానీ అతను ఆ జట్టును కొనుగోలు చేయలేదు. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలో షారూఖ్ ఖాన్  55 శాతం వాటాలు కలిగి ఉన్నారు. మిగిలిన 45 శాతం వాటాలు జూహీ చావ్లా భర్త జై మెహతాకు చెందిన మెహతా గ్రూప్ వద్ద ఉన్నాయి. ప్రీతి జింటా 2008 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టుకు భాగస్వామిగా ఉన్నారు. ఆమె కి ఆ జట్టులో 23 శాతం వాటాలు ఉన్నాయి. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా 2009లో రాజస్థాన్ రాయల్స్ లో 11.9 శాతం వాటాలు కొనుగోలు చేశారు. ఈ వాటాలు 2015 వరకు వారి దగ్గరే ఉన్నాయి. అక్షయ్ కుమార్ ఏ జట్టుకి యజమాని కానప్పటికీ.. చాలా ఏళ్ల క్రితం ఢిల్లీ తో మూడు సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నష్టాలను తగ్గించుకోవడానికి ఢిల్లీ ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు సమాచారం.

Related News

Asia Cup 2025 : ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్న టీమ్‌ఇండియా.. పాండ్య ఫోటో మాత్రం అదుర్స్

Asia Cup Final: పాక్‌ని చిత్తు చేసిన టీమిండియా, ఎక్కడైనా ఫలితం ఒక్కటే- ప్రధాని మోదీ

IND VS PAK Final: పాకిస్థాన్ పై ఆపరేషన్ “తిలక్”…9వ సారి ఆసియా కప్ గెలిచిన టీమిండియా

Suryakumar Yadav Catch: సూర్య కుమార్ నాటౌటా…? వివాదంగా క్యాచ్ ఔట్‌…పాకిస్థాన్ కు అంపైర్లు అమ్ముడుపోయారా?

IND Vs PAK : బుమ్రా దెబ్బకు కుప్పకూలిన పాకిస్థాన్ జెట్… బిత్తర పోయిన హరీస్ రవూఫ్.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..

IND VS PAK Final : 4 వికెట్లతో కుల్దీప్ ర‌చ్చ‌…జెట్స్ లాగా కుప్ప‌కూలిన పాక్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

IND VS PAK : సిక్సుల వ‌ర్షం కురిపించిన‌ పాక్ బ్యాట‌ర్…బుమ్రా స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!

IND Vs PAK : టాస్ గెలిచిన టీమిండియా.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×