E-Paper
Advertisement

Cloves Health Benefits: లవంగాలతో మతిపోయే లాభాలు!

Cloves Health Benefits: లవంగాలతో మతిపోయే లాభాలు!
Advertisement

Cloves Health Benefits : లవంగాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో లవంగాలను తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. లవంగాలను ఆయుర్వేదంలో, అనేక వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. మరి లవంగాలు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

Advertisement

లవంగాలను ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది. ఇది గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను సక్రమంగా పనిచేసేలా చేస్తు్ంది. తరుచుగా లవంగాలు తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్య కూడా తగ్గుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది:

Advertisement

లవంగాలలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో లవంగాలను తీనడం వల్ల జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది.

నోటి దుర్వాసన, దంత సమస్యల నుంచి ఉపశమనం:
లవంగాల వినియోగం పళ్లు, చిగుళ్ళకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చిగుళ్ల వాపు, నొప్పులను తగ్గిస్తాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే నోటి దుర్వాసనను పోవడంతో పాటు నోటిలోని బ్యాక్టీరియాను తొలగిపోతుంది. అందుకే లవంగాలను తరుచుగా నమలడం వల్ల దంత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

Also Read: దోసకాయ జ్యూస్‌‌తో సమస్యలన్నీ పరార్ !

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది:

లవంగాలలో ఉండే పోషకాలు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా శరీరంలో కేలరీలను బర్న్ చేస్తాయి. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, కనక ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపున లవంగాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.  అంతే కాకుండా లవంగాల పౌడర్ కూడా  ఆహార పదార్థాల్లో ఎక్కువగా వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

తలనొప్పి, మైగ్రేన్ నుండి ఉపశమనం:

లవంగాలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పి , మైగ్రేన్ తగ్గించడంలో ప్రభావవంతగా పని చేస్తాయ. ఖాళీ కడుపుతో లవంగాలను నమలడం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. తరుచుగా లవంగాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు  ఉంటాయి. కాబట్టి వీలైతే తప్పకుండా ప్రతి రోజు ఉదయం లవంగాలను తినడం అలవాటు చేసుకోండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×