BigTV English

Orange Peel Face Pack: నారింజ తొక్కతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Orange Peel Face Pack: నారింజ తొక్కతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Orange Peel Powder For Glowing Skin: నారింజ పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో చర్మ సౌందర్యానికి కూడా అంతే మంచిది. సాధారణంగా నారింజపండును చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. కానీ వాటి తొక్కలను మాత్రం పారేస్తూ ఉంటారు.  నారింజ పండు తొక్కలతో అందాన్ని రెట్టింపు చేసే సహజ గుణాలు చాలా ఉన్నాయి. పండులో కంటే తొక్కలో విటమిన్ సి, యాంటీ ఆక్సీడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖంపై మచ్చలు, మొటమలు తగ్గిస్తాయి. వృద్ధాప్య సమస్యలను దూరం చేస్తాయి. ఆరెంజ్ పీల్ చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది. నారింజ తొక్కలను పొడి రూపంలో ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా నారింజ తొక్కలను ఎండలో ఆరబెట్టి, ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. కావాలంటే ఇందులో కొన్ని గులాబీ రేకులను కూడా వేసుకోవచ్చు. మరి ఫేస్ ప్యాక్ ఎలా ట్రై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆరెంజ్ పీల్, పెరుగు ఫేస్ ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్‌లో టేబుల్ స్పూన్ పెరుగు కలిపి వాటిని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. మీ ఫేస్ కాంతివంతంగా మెరుస్తుంది.

ఆరెంజ్ పీల్, తేనె, పసుపు ఫేస్ ప్యాక్
ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పొడిలో చిటికెడు పసుపు, టీస్పూన్ తేనె కలిపి ముఖానికి , మెడకు అప్లై చేయండి. 5-10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. మీ చర్మం మెరిసేలా చేస్తుంది.


Also Read:  ఇలా చేస్తే చాలు.. డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడొచ్చు

ఆరెంజ్ పీల్ పౌడర్, ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్‌లో టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి అందులో రోజ్ వాటర్ కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖానికి అప్లై చేస్తే జిడ్డు చర్మం తొలగిపోతుంది. బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.

ఆరెంజ్ పీల్ పౌడర్, పాలు, తేనె ఫేస్ ప్యాక్
ఆరెంజ్ పీల్ పౌడర్‌లో రెండు టేబుల్ స్పూన్ పాలు, టీస్పూన్ తేనె కలిపి వాటిని బాగా మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖాన్ని అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మంపై మురికిని తొలగిస్తుంది. ఇలా చేస్తే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవడం పక్కా.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×