Big Stories

Eating Fruit : సాయంత్రం పండ్లు తింటే ఏమవుతుంది?

Eating Fruit : పండ్లలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ప్రతి రోజు రెండుసార్లు పండ్లను తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు. మన శరీరంలోని అవయవాల పనితీరు మరింత మెరుగుపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పండ్లు తగ్గిస్తాయి. అయితే గరిష్ట పోషకాలు అందాలంటే భోజనంతో పాటు పండ్లను కూడా సరైన సమయంలో తీసుకోవాలి.

- Advertisement -

అయితే సూర్యాస్తమయానికి ముందే పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం, పురాతన భారత వైద్య విధానం ప్రకారం, సాయంత్రం పండ్లను తీసుకుంటే నిద్ర షెడ్యూల్‌కు ఆటంకం కలుగుతుందని, జీర్ణ ప్రక్రియకు కూడా అంతరాయం ఏర్పడుతుందని అంటున్నారు. పండ్లలో చాలా వరకు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఆ సమయంలో అవి రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ని పెంచుతాయి.

- Advertisement -

నిద్రసమయంలో రక్తంలో చక్కెర స్థాయి పెరగడంతో నిద్రకు భంగం వాటిళ్లుతుంది. అంతేకాకుండా సూర్యాస్తమయం తర్వాత మన జీవక్రియ మందగిస్తుంది, కార్బోహైడ్రేట్లు జీర్ణం కావడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి కార్బోహైడ్రేట్లు తీసుకోవడం తక్కువ చేస్తే మంచిది. ఉదయం ఖాళీ కడుపుతో పండు తినడం మంచిదని నిపుణులు అంటున్నారు. రాత్రి 10 గంటల పాటు ఏమీ తినకుండా ఉదయం మేల్కొనే సరికి మన పొట్ట పూర్తిగా ఖాళీగా ఉంటుంది. ఉదయం ఆరోగ్యకరమైన భోజనం తినడంతో పోషకాలను ప్రభావవంతంగా గ్రహించవచ్చు.

జీవక్రియ కూడా బాగుంటుంది. భోజనం చేసిన వెంటనే పండ్లు తినాలని నిపుణులు అంటున్నారు. పండు తినడానికి ముందు, భోజనం తర్వాత కనీసం 4 గంటల సమయం ఉండాలని చెబుతున్నారు. సాధారణంగా కార్బోహైడ్రేట్లు ఉదయం, వ్యాయామానికి ముందు, తర్వాత ఉత్తమంగా పనిచేస్తాయి. కొవ్వు, ప్రోటీన్, తక్కువ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు సూర్యాస్తమయం తర్వాత బాగా పనిచేస్తాయి. పండ్లు ఎప్పుడూ వేటితో కలపకుండా తినాలని చెబుతున్నారు. పాలు, కూరగాయలతో పండ్లు తీసుకోవడంతో శరీరంలో టాక్సిన్స్ వస్తాయి. పండ్లు సరిగ్గా జీర్ణం కాకపోవడం, పోషకాలను తక్కువగా గ్రహించడం వల్ల ఇలా జరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News