BigTV English
Advertisement

War 2 Update: ‘వార్ 2’ సాంగ్‌ షూట్.. ఎన్టీఆర్ – హృతిక్ పోటీ పడి మరీ ఇరగదీస్తారంట..!

War 2 Update: ‘వార్ 2’ సాంగ్‌ షూట్.. ఎన్టీఆర్ – హృతిక్ పోటీ పడి మరీ ఇరగదీస్తారంట..!

War 2 Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నటన పరంగా.. యాక్షన్ సీన్లతో గూస్ బంప్స్ తెప్పిస్తాడు. ఎమోషన్ సీన్లతో గుండెల్లో దాగివున్న కన్నీరుని బయటకు రప్పిస్తాడు. ఇక డ్యాన్స్‌ గురించి ఎలాంటి సందేహమూ లేదు. ఎలాంటి స్టెప్పునైనా పిప్పి పిండిచేయడంలో ఎన్టీఆర్ దిట్ట.


మరి ఇలాంటి మల్టీ టాలెంటెడ్ హీరో సినిమా వస్తుందంటే ఎవరూ మాత్రం ఎదురుచూడకుండా ఉంటారు చెప్పండి. అదీగాక గతేడాది ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల గుండెల్లో నిలిచిపోయాడు. ఆ మూవీలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా హాలీవుడ్ నటీమణులు సైతం ఎన్టీఆర్‌తో నటించేందుకు సిద్ధమయ్యారు.

అలాంటి స్టార్ హీరో ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసిందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగానే బాలీవుడ్‌లో ‘వార్ 2’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. ఎన్టీఆర్ ‘రా’ ఏజెంట్‌గా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: ‘వార్ 2’ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్.. ఇక బాక్సాఫీసు బద్దలే!

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడు అయాన్ ముఖర్జీ హృతిక్ – ఎన్టీఆర్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్, హృతిక్‌లపై ఓ సాంగ్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

పబ్ నేపథ్యంలో ఈ సాంగ్ సాగనున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో ఈ ఇద్దరి స్టార్లతో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా చిందేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బ్యాగ్రౌండ్‌లో కొన్ని సీన్లు జరుగుతుండగా.. ఈ సాంగ్ నడుస్తూ ఉంటుందని సినీ వర్గాల సమాచారం. అయితే ‘ఆర్ఆర్ఆర్’లో నాటు నాటు సాంగ్‌కు చరణ్, ఎన్టీఆర్ ఎలా అయితే పోటీ పడి మరీ డ్యాన్స్ స్టెప్పులు ఇరగదీశారో.. ఇప్పుడు ఇందులో కూడా అలానే ఎన్టీఆర్, హృతిక్ పోటీ పడి మరీ మాస్ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తుంది. అయితే సాంగ్ మాత్రం సినిమాకే హైలైట్‌గా ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×