Big Stories

Land Titling Act Issue In AP: యాక్ట్‌పై ఫైట్‌ నెగ్గేదెవరు?

Controversy over Land Titles Act In AP: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాక రేపుతోంది. ఎన్నికలు సరిగ్గా వారం రోజులు ఉందనగా ఇప్పుడు రాజకీయమంతా దీని చుట్టే తిరుగుతోంది. జగన్‌ భూములు దోచుకునేందుకు వేసిన కొత్త ఎత్తుగడ ఇది. అని టీడీపీ.. ఎన్నికల్లో దొడ్డి దారిన గెలిచేందుకు కావాలని చేస్తున్న రచ్చ ఇది. అని వైసీపీ.. పంచాయితీ మొత్తం ఇదే ఇప్పుడు. ఇప్పటికే ఈ యాక్ట్‌ ఏంటి? అమలు చేస్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను మనం డిస్కస్ చేశాం.. ఇప్పుడు దీనిపై జరుగుతున్న రాజకీయమేంటో చూద్దాం.

- Advertisement -

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్.. ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు ఈ చట్టం.. 16 రిజిస్ట్రేషన్‌ ఆఫీస్ పరిధిలో పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. కానీ అప్పుడే దీనిపై జరుగుతున్న పంచాయితీ అంతా ఇంతా కాదు. అఫ్‌కోర్స్‌ ఎన్నికల సమయం కావడంతోనే ఈ స్థాయిలో జరుగుతుంది వివాదం.. ఈ విషయం అందరికి తెలిసిందే.. కానీ ఇప్పుడు ఇందులోకి కొందరు పెద్దలు కూడా ఎంటరవ్వడంతో సీన్‌ మారింది..

- Advertisement -

పీవీ రమేష్‌.. మాజీ ఐఏఎస్‌ అధికారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఆయన చేసిన ట్వీట్‌.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఓ సెన్సెషన్.. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే.. ఈ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడిని.. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారు. IAS అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేము.ఇదీ ఆయన చేసిన ట్వీట్ సారాంశం.

Also Read: సొంత బంధువులే శత్రువులు.. డిప్యూటీలా ఫ్రస్టేషన్

ఖతమ్.. ఇంకేముంది ఇప్పటికే ఈ యాక్ట్‌పై నిప్పులు చెరుగుతున్న విపక్షాలకు..
రమేష్‌ చేసిన ఈ ట్వీట్‌.. ప్యూర్ నెయ్యి లాగా పనిచేసింది. ఈ ట్వీట్‌ను టీడీపీ తమ అస్త్రంగా మలుచుకుంది. మేము ముందు నుంచే చెబుతున్నాం. ఈ యాక్ట్‌ ఎంత ప్రమాదకరమో.. ఇప్పుడు పెద్దవాళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యులకు ఆ దేవుడే దిక్కు అంటూ అన్నట్టుగా ట్వీట్ చేసింది టీడీపీ.. తన ఎన్నికల ప్రచారంలో ఈ యాక్ట్‌పై అధికార పార్టీ పెద్దలను చీల్చి చెండాడుతున్నారు చంద్రబాబు.
అయితే వైసీపీ క్యాంప్‌ నుంచి కూడా ఇదే స్థాయిలో కౌంటర్లు మొదలయ్యాయి. పీవీ రమేష్‌ కూడా చంద్రబాబు క్యాంప్‌లోని మనిషే అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

విమర్శలు వాటికి కౌంటర్లు ఎలా ఉన్నా లెటెస్ట్‌గా ఓ విషయాన్ని బయట పెట్టింది వైసీపీ.. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు అనుకూలంగా టీడీపీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందులో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీ సాక్షిగా ఈ చట్టం అమలును ఆహ్వానించారు. కాస్త సమస్యలు వస్తాయని.. అయినా కూడా వాటిని ఎదురించి అమలు చేస్తే చాలా సమస్యలు తీరుతాయన్నారు ఆయన.

నిజమే.. ఈ వీడియో నిజమా? కాదా? అంటే ఆయన ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడారు..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం ఏపీలో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఎన్డీఏ కూటమి.. అటు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు ఇప్పుడు బీజేపీ నేతలు కూడా జగన్ టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీ, జనసేనలు ఇతర అంశాలపై ఫోకస్ చేస్తుంటే.. వైసీపీ సర్కార్‌ అవినీతినే టార్గెట్‌ చేసింది బీజేపీ.

విన్నారుగా జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. మీరు వేసే ఓటు ఏపీ మార్పుకు సంకేతమంటున్నారు. నిన్నా మొన్నటి వరకు జగన్‌పై ఫుల్ ఫ్లెడ్జ్‌ విమర్శలు చేయని మోడీ కూడా.. ఇప్పుడు తన స్పీచ్‌ను మార్చేశారు. సో ఓవరాల్‌గా చూస్తే జగన్‌ను త్రిశూల వ్యూహంలాగా ఇరుకున పెట్టేస్తుంది ఎన్డీఏ కూటమి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News