Big Stories

Identify Fake Rice: మీరు ప్రతి రోజూ తినే బియ్యం మంచివేనా.. క్వాలిటీ ఎలా చెక్ చేయాలో తెలుసా?

Identify Fake Rice: మనం తరచూ ఉపయోగించే ఆహార పదార్థాల్లో ముఖ్యంగా బియ్యం ఒకటి. వంటలు ఎన్ని చేసినా సరే వాటిని తినడానికి మాత్రం బియ్యం కావాల్సిందే. అయితే ప్రస్తుత కాలంలో ఏ వస్తువులు చూసినా కల్తీ అవుతున్నాయి. నూనె, పాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, పప్పులు ఇలా ఏ వస్తువులు చూసినా కల్తీగానే దొరుకుతున్నాయి. అయితే ఇదే మాదిరిగా బియ్యం కూడా కల్తీగానే లభిస్తుంది. మార్కెట్లో అడ్డగోలుగా బియ్యంను కూడా కల్తీ చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఈ తరుణంలో ఏది కల్తీనో, ఏది ఒరిజినల్ బియ్యం అనే తేడా తెలియకుండా పోతుంది. అంతేకాదు ప్రజలు కూడా కొనే బియ్యం ఎలాంటిది అనే విషయం తెలియకుండా కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్లాస్టిక్ బియ్యం, మంచి నాణ్యమైన బియ్యం ఈ రెండిట్లో తేడాలు ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ప్లాస్టిక్‌ బియ్యాన్ని ఇలా గుర్తించండి

- Advertisement -

మార్కెట్లో కొనుగోలు చేసే బియ్యం నాణ్యమైనదా లేక కల్తీ అయిన ప్లాస్టిక్ బియ్యమా అనే విషయాన్ని ఈజీగా గుర్తుపట్టేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా బియ్యం కొనుగోలు చేసే సమయంలో బియ్యాన్ని నీటిలో వేసి చూడాలి. బియ్యం నీటిలో తేలితే అది ప్లాస్టిక్ బియ్యం. ఎందుకంటే ప్లాస్టిక్ వస్తువులు నీళ్లలో తేలుతాయి కాబట్టి సులువుగా గుర్తించవచ్చు.

బియ్యం నమలాలి..

కొనుగోలు చేసే సమయంలో బియ్యాన్ని కొన్ని తీసుకుని నమిలి చూడాలి. ఇలా చేసినప్పుడు బియ్యం సులువుగా నమిలితే అది నాణ్యమైనదని, లేక నమలడానికి చాలా సమయం తీసుకుంటే అది ప్లాస్టిక్ బియ్యం అని అర్థం.

కాల్చడం..

కొన్ని బియ్యం గింజలను తీసుకుని కాల్చడం ద్వారా అది ప్లాస్టిక్ బియ్యమా లేక నాణ్యమైన బియ్యమో ఈజీగా తెలుసుకోవచ్చు.

వేడి నూనెలో వేయాలి..

బియ్యాన్ని వేడి నూనెలో వేసి చూడడం వల్ల బియ్యం కరిగిపోతే ప్లాస్టిక్ బియ్యం అని అర్థమవుతుంది. అంతేకాదు అన్నం వండే సమయంలోను గంజి వంపేటపుడు ముద్దలు కడితే అది ప్లాస్టిక్ అని తేలుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News