Big Stories

Israel vs Gaza War: ఇజ్రాయెల్ పంతం! యుద్ధం తప్పదా?

Israel’s war on Gaza updates(Latest world news): గాజాపై మరోసారి యుద్ధమేఘాలు ముసురుకున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌ వార్ సైరెన్ మోగించడం.. దాడులు చేయడం కూడా మొదలైంది. ఉన్నట్టుండి గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ ఎందుకు ఫోకస్ చేసింది? చర్చలు ఏమయ్యాయి? ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా.. వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్ ఎందుకు అంటోంది? అసలు మిడిల్‌ ఈస్ట్‌లో ఏం జరుగుతోంది? అరబ్‌ దేశాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యుద్ధ మేఘాలు అనుకున్నదానికంటే వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పుటికే నివురు గప్పిన నిప్పులా ఉన్న పరిస్థితికి నిప్పు రాజేసింది ఇజ్రాయెల్.. రఫాపై దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో 16 మంది మరణించారు. ఈ కౌంట్‌ ఇంకా పెరిగే చాన్సుంది. ఎందుకంటే దాడులు చేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తెల్చి చెప్పడం..దీనికి ముందు చాలా పరిణామాలు జరిగాయి. ఫస్ట్‌ ఈజిప్ట్‌లోని కైరోలో హమాస్‌తో చర్చలు జరిపింది ఇజ్రాయెల్. కానీ ఇవి అస్సలు సఫలం కాలేదు.ఎందుకు అంటే.. హమాస్‌ పెట్టిన నిబంధనలకు ఇజ్రాయెల్ అంగీకరించకపోవడమే.

- Advertisement -

అసలు హమాస్ ఏం కండిషన్స్ పెట్టింది? ఫస్ట్.. గాజాలో వెంటనే సీజ్‌ ఫైర్ అమలు చేయాలి. సెకండ్.. గాజాలో ఉన్న ఇజ్రాయెల్ ఆర్మీని వెంటనే వెనక్కి పిలిపించాలి. థర్డ్.. గాజా నుంచి వెళ్లిపోయిన వారందరికి మళ్లీ అదే ప్రాంతంలో జీవించేందుకు అంగీకరించాలి. ఫోర్త్.. గాజా ప్రజల జీవితాలు మెరుగుపర్చేందుకు అన్ని రకాలుగా సహాయ పడాలి. ఫిఫ్త్.. ప్రస్తుతం ప్రజలను అడ్డుకునే విధానాన్ని ఎత్తేయాలి.. ఖైదీలను ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి. అక్టోబర్‌ 7న తాము బంధీలుగా చేసిన వారిని విడిపించాలంటే.. వారికి బదులుగా ఇజ్రాయెల్‌ జైళ్లల్లో బంధీలుగా ఉన్న పాలస్తీనా వారిని విడుదల చేయాలి. ఇవీ హమాస్‌ పెట్టిన డిమాండ్లు.. అంటే హమాస్‌ ప్రపంచానికి చెప్పిన డిమాండ్లు అయితే ఇవీ..

- Advertisement -

Also Read: ఆస్ట్రేలియా మహిళా ఎంపీపై లైంగిక దాడి

అయితే ఈ డిమాండ్స్‌పై తీవ్రంగా రియాక్టైంది ఇజ్రాయెల్.. అంటే హమాస్‌ను మళ్లీ గాజాలోకి వెల్‌ కమ్ చెప్పి.. మళ్లీ తమ ప్రాంతంపై దాడులు చేయించుకోవాలా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఆర్మీని వెనక్కి పిలిపిస్తే అక్కడ కట్టేది ఇళ్లు కాదని.. మళ్లీ బంకర్లు నిర్మించి ఇజ్రాయెల్ ప్రజలపై దాడులు చేస్తారని చెబుతున్నారు. అందుకే హమాస్‌ కండిషన్స్‌కు ఒప్పుకునేది లేదన్నారు నెతన్యాహు.. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చేసిన స్టేట్‌మెంట్‌.. చేసిన చర్యలే ఇప్పుడు అసలు పంచాయితీకి కారణం.

హమాస్‌తో చర్యలు విఫలం కాగానే నెతన్యాహు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే రఫాపై దాడి చేయాలి. ప్రస్తుతం గాజా నుంచి వలస వెళ్లిన వారంతా రఫాలోనే ఉన్నారు. దాదాపు 15 లక్షల మంది వరకు అక్కడ ఉన్నారని ఓ అంచనా.. వీరందరిని ఆ ప్రాంతం ఖాళీ చేయాలని హెచ్చరిస్తోంది ఇజ్రాయెల్.. హమాస్‌ టన్నెల్‌ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తూ వస్తున్న ఇజ్రాయెల్‌కు ఓ అనుమానం ఉంది. అదేంటంటే హమాస్‌ తీవ్రవాదులంతా సామాన్య ప్రజలతో కలిసి పోయి రఫాలోనే నక్కి ఉన్నారని. సమయం కోసం వేచి చూస్తున్నారని.. ఒక్కసారి సీజ్‌ ఫైర్ కాగానే మళ్లీ దాడులు చేసేందుకు రెడీగా ఉన్నారని.. అందుకే తాము ఏ చాన్స్‌ తీసుకోమని.. రఫాపై దాడులు చేస్తామంటోంది ఇజ్రాయెల్.. చెప్పినట్టుగానే ఇప్పటికే దాడులు కూడా మొదలయ్యాయి.

బట్‌ ఇక్కడో తిరకాసు ఉంది. రఫాపై దాడులు చేసేందుకు ఒప్పుకోమంటోంది అమెరికా.. గ్రౌండ్ అసాల్ట్ ప్రారంభిస్తే చర్యలు కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇస్తోంది. సో ఇప్పుడు దాడులు చేస్తే ఇజ్రాయెల్‌ ఒంటరిగానే చేయాలి. దీనికి వెస్ట్రన్ కంట్రీస్‌ మద్ధతు ఉండదని మనకు అర్థమవుతోంది. అయితే నెతన్యాహు ఇక్కడో కీలక స్టేట్‌మెంట్ ఇచ్చారు. అదేంటంటే.. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. అప్పుడు మాకు ఎలాంటి రక్షణ లేదు.. ఏ దేశం మాకు అండగా నిలవలేదు. ఇప్పుడు కూడా మా విధ్వంసం కోరుకుంటున్నారు.

Also Read: ఎన్డీయే పనైపోయింది, 150 కూడా కష్టమేనన్న రాహుల్

ఇప్పుడు కూడా ఏ దేశం మాకు అండగా నిలవకపోయినా మాకు బాధలేదు. మమ్మల్ని మేము రక్షించుకోవడం నుంచి ఎవరూ ఆపలేరు. ఇదీ ఆయన మాటల సారాంశం. అంతేకాదు అమెరికా వర్సిటీలో జరుగుతున్న ఆందోళనలపై కూడా ఆయన రియాక్టయ్యారు.. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జర్మనీలో కూడా ఇదే జరిగిందని ఇది కూడా అలాంటిదే అన్నారు. అంతేకాదు ఇది తమ ఉనికినే సవాల్ చేయడమన్నారు. నిజానికి నెతన్యాహు వ్యాఖ్యల్లో చాలా ఇంటెన్సిటీ ఉంది. చావో.. రేవో అన్నట్టుగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు.. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది.

ఇదిలా ఉంటే ఖతార్‌లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఖతార్‌ ప్రధాని మొహమ్మద్ మిన్ రహ్మాన్ అల్‌ థానీతో అమెరికా సీఐఏ డైరెక్టర్ బిల్‌ బర్న్స్‌ చర్చలు జరుపుతున్నారు. గాజా వార్‌ను కవర్ చేస్తున్న అల్ జజీరాపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టవద్దని అమెరికా ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఈజిప్ట్‌, ఇరాన్‌, ఇరాక్‌ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై పీకల దాకా కోపంగా ఉన్న ఇరాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది టెన్షన్ పెంచుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పటికే లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు మొదలుపెట్టింది. యూనైటెడ్ నేషన్స్‌ అటామిక్‌ వాచ్‌ డాగ్‌ చీఫ్‌ రాఫెల్ గ్రోసీ ఇరాన్‌లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఓ గ్రనేడ్ పిన్‌ పీకి చేతిలో పట్టుకొని ఉంది ఇజ్రాయెల్‌.. ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ ఇజ్రాయెల్‌ను ఎయిమ్‌ చేసి చాలా దేశాలు, సంస్థలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు క్షణక్షణం టెన్షన్‌ పెరగడమే కానీ.. తగ్గడం అనే కాన్సెప్టే కనిపించడం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News