Big Stories

Vishal – Rathnam OTT: నెలలోపే ఓటీటీలోకి విశాల్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Vishal – Rathnam OTT update(Latest movies in tollywood): కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో సినీ ప్రియుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటుంటాడు. అయితే ఇక్కడొక విశేషం ఏంటేంటే.. అతడు ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేస్తాడు. లవ్ కాన్సెప్ట్ స్టోరీల జోలికి అస్సలు పోడు. విశాల్ సినిమా వస్తుందంటే యాక్షన్ కోసం ఎదురుచూసే సినీ అభిమానులకు పండగే అని చెప్పాలి.

- Advertisement -

అయితే రీసెంట్‌గా అలాంటి యాక్షన్ ప్యాక్డ్ సినిమాతోనే విశాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగా మాస్ దర్శకుడు హరి రత్నం డైరెక్షన్‌లో ‘రత్నం’ మూవీ చేశాడు. ఇందులో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. అంతేకాకుండా వెర్సెటైల్ యాక్టర్ సముద్రఖని, మురళీ శర్మ, యోగిబాబు, విజయ్ కుమార్ వంటి నటులు ఇందులో కీలక పాత్రలో నటించి మెప్పించారు.

- Advertisement -

జీ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ ప్రొడ్యూసర్ కార్తికేయన్ సంతానం ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఫస్ట్ నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉండగా.. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. అంతేకాకుండా దర్శకుడు హరి రత్నం గతంలో కూడా విశాల్‌తో పూజ, భరణి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో మూవీపై మరింత బజ్ ఏర్పడింది.

Also Read: ఒక అమ్మాయి కోసం ఇంత విధ్వంసమా.. ఏంది విశాల్ బ్రో ఇది..?

మొత్తంగా ఎన్నో అంచనాలతో ఏప్రిల్ 26న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అద్బుతమైన ట్విస్ట్‌లతో, మాస్ యాక్షన్ సీన్లతో విశాల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో యాక్షన్ ఓ రకమైతే.. ఈ రత్నం మూవీలో ఉన్న యాక్షన్ మరొక రకం అనే చెప్పాలి.

ఇక ఈ చిత్రానికి ఓపెనింగ్స్‌ కూడా బాగానే వచ్చాయి. మొత్తంగా థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని మే 24 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. తమిళ, తెలుగులో ఏకకాలంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News