BigTV English

Woman Tortures Husband : భర్తను సిగరెట్లతో కాల్చి.. ఛాతీపై కూర్చుని.. నరకం చూపించిన భార్య

Woman Tortures Husband : భర్తను సిగరెట్లతో కాల్చి.. ఛాతీపై కూర్చుని.. నరకం చూపించిన భార్య

Woman Tortures Husband in UP : ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో ఒక వివాహిత తన భర్తను చిత్రహింసలకు గురిచేసింది. అతని శరీర భాగాలను కాల్చి నరకం చూపించింది. భార్య తనను చిత్రహింసలకు గురిచేస్తుందని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సియోహరా జిల్లా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.


భర్త మనన్ జైదీ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య మెహర్ జహాన్.. తాను మద్యం మత్తులో ఉండగా.. కాళ్లు, చేతులు కట్టివేసి సిగరెట్ తో కాల్చి చిత్రహింసలు పెట్టింది. ఇంటిలోపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలో మెహర్ జహాన్ చిత్రహింసలకు గురిచేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. మనన్ కాళ్లు కట్టేసి.. అతని ఛాతీపై కూర్చుని గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించినట్లు ఫుటేజీలో రికార్డైంది.

Also Read : ఫోన్ కాల్స్ విషయంలో గొడవ.. అన్నను చంపేసిన చెల్లెలు!


గతంలో కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. తన భార్య తనకు మత్తుమందు ఇచ్చి.. కాళ్లు, చేతులు కట్టివేసి దుర్భాషలాడిందని వాపోయాడు. హత్యాయత్నం, దాడి, చిత్రహింసలతోపాటు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని పలు సెక్షన్ల కింద మెహర్ జహాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ ధరంపాల్ సింగ్ తెలిపారు.

Related News

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

West Godavari Crime: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, సోదరుడికి మెసేజ్, పాలకొల్లులో దారుణం

Fire Accident: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు

UP Crime News: మైనర్ ప్రియురాలిని కాల్చిన ప్రియుడు, ఆ తర్వాత ఏం జరిగింది? యూపీలో దారుణం

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Big Stories

×