Big Stories

Medigadda Barrage: నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్న జస్టిస్ చంద్రఘోష్

Medigadda Barrage latest news(Telangana today news): కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తునకు ఏర్పాటైన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఆయన రాత్రి రామగుండంలో బస చేయనున్నారు. 8న రామగుండం నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈ క్రమంలో అన్నారం బ్యారేజీని కూడా సందర్శించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, గత సంవత్సరం అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఈ నెల 9న ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై న్యాయవిచారణకు సంబంధించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. బ్యారేజీల నిర్మాణం విషయంలో నిర్ణయాల్లో భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసే అంశానికి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also Read: మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్..! చెక్ చేసుకోండి

అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించినటువంటి ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణానికి సంబంధించి చోటు చేసుకున్న నిర్లక్ష్యం, లోపాలు, అక్రమాలు, అవినీతి, ప్రజాధనం దుర్వినియోగంపై న్యాయవిచారణ జరపడానికి సుప్రీంకోర్టు రిటైర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ చంద్రఘోష్ ను కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం విధితమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News