BigTV English

Rohit Sharma: కెప్టెన్ రోహిత్ ఏమైంది?.. టీ 20 వరల్డ్ కప్ కి సిద్ధమేనా?

Rohit Sharma: కెప్టెన్ రోహిత్ ఏమైంది?.. టీ 20 వరల్డ్ కప్ కి సిద్ధమేనా?

Rohit sharma latest news(Cricket news today telugu): టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వివాదాలు కొత్త కాదు. కొన్ని తనకు సంబంధం లేకుండా వస్తే, కొన్ని తనకు తానుగా క్రియేట్ చేసుకుని తెచ్చుకుంటాడు. అంటే ఇంటర్నేషనల్ పిచ్ లపై కామెంట్లు చేస్తాడు. ఇండియన్ పిచ్ లపై విమర్శిస్తే ఊరుకోడు. ఇక పరోక్షంగా చూస్తే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తనకి సంబంధం లేకుండా కెప్టెన్సీ నుంచి తీసేయడంతో వివాదాల్లో పడ్డాడు.


ముంబై జట్టు గెలుస్తున్నా, ఓడుతున్నా జట్టులో మాత్రం ఇబ్బందులు తగ్గినట్టే కనిపిస్తున్నాయి. ఇదంతా ఒకలా ఉంటే ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరినీ కలవరపెడుతోంది. టీమ్ ను ప్రకటించిన తర్వాత ఇప్పటికి 3 మ్యాచ్ లు ఆడితే, అన్నింట్లోనూ 10 లోపే అయిపోతున్నాడు. ఇది టీమ్ మేనేజ్మెంట్ ని కలవరపెడుతోంది.

Also Read: రాజస్థాన్ నెంబర్ వన్ అవుతుందా? నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్


అంతేకాదు ఇంతకాలం దఢ్ దఢ్ లాడించిన వాళ్లు టీ 20 ప్రపంచకప్ టీమ్ లో ఎంపికైన దగ్గర నుంచి ఘోరంగా ఆడుతున్నారు. వారిలో శివమ్ దూబె, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, చాహల్ ఇలా చాలామంది ప్రదర్శన ఆకట్టుకోవడం లేదు. బాగా ఆడుతున్నవారిలో ప్రస్తుతం బుమ్రా, సూర్యకుమార్, విరాట్ కొహ్లీ, యశస్వి, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ ఇలా మెరుస్తున్నారు. పాండ్యా కూడా తాజా మ్యాచ్ లో 3 వికెట్లు తీసి ఫామ్ లోకి వచ్చాడు.

వీరందరికన్నా రోహిత్ శర్మ ఫామ్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.రోహిత్  నాలుగోసారి కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఐపీఎల్ 2024 సీజన్ ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించిన రోహిత్.. సెకండాఫ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి 7 ఇన్నింగ్స్‌ల్లో 297 పరుగులు చేసిన రోహిత్ తర్వాతి 5 ఇన్నింగ్స్‌ల్లో 34 పరుగులు మాత్రమే చేశాడు. వీటిని చూసిన  ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది కరెక్ట్ కాదని, ఇది మంచి పరిణామం కాదని అన్నాడు. అందరూ ఉత్సాహంగా, భీకరమైన ఫామ్ తో ఫ్లయిట్ ఎక్కాలని అన్నాడు. మరి రోహిత్ శర్మ తిరిగి పుంజుకుంటాడని మనం ఆశిద్దాం.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×