Big Stories

World Asthma Day 2024: ఆస్తమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

World Asthma Day 2024: ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల రుగ్మత. ఇది శరీరంలోని వాయుమార్గాలను చాలా ఇబ్బందికరంగా చేస్తుంది. అంతేకాదు దీని వల్ల వాపు కూడా వస్తుంది. దీని కారణంగా గాలి ఊపిరితిత్తులకు అందకుండా ఉంటుంది. ఇది వ్యక్తికి శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ఇలా చిన్న ఆస్తమా కూడా రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. ఆస్తమా యొక్క కొన్ని సాధారణ లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, దగ్గు, గురక వంటివి ఉంటాయి. ప్రతి సంవత్సరం, ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఈ రుగ్మత గురించి అవగాహన కల్పించడానికి, ఆస్తమా ఉన్నవారి జీవితాలను సులభతరం చేయడానికి జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆస్తమా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

- Advertisement -

ఈ సంవత్సరం, ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని మే 7న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం, మే నెల మొదటి మంగళవారం నాడు ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మే 7న అంటే మంగళవారం రోజు ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

- Advertisement -

Also Read: మీరు ప్రతి రోజూ తినే బియ్యం మంచివేనా.. క్వాలిటీ ఎలా చెక్ చేయాలో తెలుసా?

చరిత్ర:

గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA) 1993లో స్థాపించబడింది. మొదటి ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని 1998లో నిర్వహించడం జరిగింది. GINA ద్వారా నిర్వహించబడిన ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఆస్తమాతో బాధపడుతున్న వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో జరుపుకుంటారు. ఆస్తమాతో బాధపడుతున్న వ్యక్తులను శక్తివంతం చేయడంలో, వారికి మెరుగైన జీవితాన్ని అందించడంలో కలిసి పనిచేయడానికి వైద్యులు, రోగులు, సంస్థలను ఒకచోట చేర్చడం ఈ రోజు లక్ష్యం.

ప్రాముఖ్యత:

“2024 ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పురస్కరించుకుని, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA) – ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్ అనే థీమ్‌ను ఎంచుకుంది. ఆస్తమా ఉన్నవారికి వారి వ్యాధిని నిర్వహించడానికి తగిన విద్యను అందించి, ఎప్పుడు గుర్తించాలో GINA పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News