Big Stories

IPL 2024 Playoff Scenario: ఐపీఎల్ 2024..ప్లే ఆఫ్ కి వెళ్లే జట్లు ఏవి?

IPL 2024 Playoff Qualification Scenarios And Chances of All 10 Teams: ఐపీఎల్ 2024 సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లకు ఇప్పుడు 55 మ్యాచ్ లు జరిగాయి. ముంబై వర్సెస్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ తో ప్లే ఆఫ్ అవకాశాలపై అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

- Advertisement -

ముఖ్యంగా పాయింట్లతో చెప్పాలంటే కోల్ కతా (16), రాజస్థాన్ రాయల్స్ (16) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్ బెర్త్ లను దాదాపు ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన రెండు  స్థానాలకు చూస్తే ప్రస్తుతం మూడు జట్లు పోటీ పడుతున్నాయి.

- Advertisement -

వాటిలో ఒకటి హైదరాబాద్ సన్ రైజర్స్, 2. చెన్నయ్ సూపర్ కింగ్స్, 3. లక్నో సూపర్ జెయింట్స్. వీటి మధ్య పోరు హోరాహోరీ నడుస్తోంది. ఈ మూడు జట్లు కూడా 11 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ లు గెలిచాయి. 12 పాయింట్లతో ఉన్నాయి. అయితే రన్ రేట్ ప్రకారం ఈ మూడు జట్లలో చెన్నయ్ టాప్ లో ఉంది. తర్వాత హైదరాబాద్, దాని తర్వాత లక్నో ఉన్నాయి.

ఇవి మూడు కూడా ఇంకా 3 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం రెండు గెలిచినా సరే, ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయని అంటున్నారు.పాయింట్లు సమానమైతే, ఇప్పటిలా రన్ రేట్ ప్రకారం రెండు జట్లు ప్లే ఆఫ్ కి వెళతాయి. ఈ నేపథ్యంలో గెలిస్తేనే సరిపోదు, రన్ రేట్ కూడా ముఖ్యమేనని అంటున్నారు.

Also Read: రాజస్థాన్ నెంబర్ వన్ అవుతుందా? నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్

ఇదిలా ఉంటే.. వీటి వెనుకే ఢిల్లీ (10), పంజాబ్ కింగ్స్ (8), ఆర్సీబీ (8)  మూడు జట్లు కూడా రేస్ లో పరిగెడుతున్నాయి. ఎలాగంటే పైన పేర్కొన్న మూడు జట్లు హైదరాబాద్, చెన్నయ్, లక్నో తాము ఆడాల్సిన మూడు మ్యాచ్ లు వరుసగా ఓడిపోయి, 12 పాయింట్ల మీద అలాగే ఉండిపోవాలి.

ఈ సమయంలో ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ ఆడాల్సిన మూడు మ్యాచ్ లు వరుసగా గెలవాలి. అప్పుడు ఢిల్లీకి 16, ఆర్సీబీ 14, పంజాబ్ 14తో వీటిని దాటేస్తాయి. అప్పుడు చివరికి రన్ రేట్ ప్రకారం రెండు జట్లు ప్లే ఆఫ్ కి చేరుతాయి.ఇలా జరగాలి, అలా జరగాలి, అది ఓడిపోవాలి ఇది గెలవాలి ఇలా అనుకోవడం అత్యాశే అవుతుందని సీనియర్లు అంటున్నారు.

ఇక చివరిగా చెప్పుకోవాలంటే 12 మ్యాచ్ లు ఆడి, 4 గెలిచిన ముంబై ఇండియన్స్ (8) కథ ముగిసిపోయింది. అధికారికంగా చెప్పకపోయినా ఐపీఎల్ సీజన్ 2024 నుంచి మొదట అవుట్ అయ్యేది ముంబై అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. దీంతో పాటు గుజరాత్ టైటాన్స్ (8) కూడా ప్లే ఆఫ్ అవకాశాలు లేనట్టేనని అంటున్నారు. తనింకా 4 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇది కూడా వరుసగా గెలవాలి. మరి ఈ అట్టడుగున ఉన్న జట్ల కలలన్నీ నిజం కావాలని మనం కూడా కోరుకుందాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News