E-Paper
Advertisement

Gut Health:పేగులలో వాపు ? మీ శరీరం ఇచ్చే ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Gut Health:పేగులలో వాపు ? మీ శరీరం ఇచ్చే ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Advertisement

Gut Health: మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ కేవలం ఆహారాన్ని అరిగించుకోవడానికే కాదు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక జీవన శైలి, జంక్ ఫుడ్, విపరీతమైన ఒత్తిడి వల్ల చాలా మంది ‘ఇన్‌ఫ్లేమ్డ్ గట్’ సమస్యతో బాధపడుతున్నారు. పేగులలో వాపు ఏర్పడినప్పుడు.. అది కేవలం జీర్ణ క్రియనే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీ పేగులు ఆరోగ్యంగా లేవని చెప్పడానికి శరీరం ఇచ్చే 6 ముఖ్యమైన సంకేతాలు , వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పేగులలో వాపును సూచించే 6 ప్రధాన సంకేతాలు:

తరచుగా పొట్ట ఉబ్బరం, గ్యాస్: ఆహారం తిన్న తర్వాత పొట్ట బిగుతుగా అనిపించడం, తరచుగా గ్యాస్ రావడం పేగులలో బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిన్నదని చెప్పడానికి ప్రధాన సంకేతం. పేగులలో హానికర బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్ విడుదలవుతుంది.

Advertisement

మలబద్ధకం లేదా విరేచనాలు: మీ మల విసర్జన అలవాట్లలో అకస్మాత్తుగా మార్పులు రావడం.. అంటే తరచుగా విరేచనాలు అవ్వడం లేదా తీవ్రమైన మలబద్ధకం ఉండటం పేగుల వాపుకు సంకేతం. ఇది ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ కు కూడా దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.

చర్మ సమస్యలు : పేగుల ఆరోగ్యానికి.. చర్మానికి దగ్గరి సంబంధం ఉంటుంది. పేగులలో వాపు ఉన్నప్పుడు శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లలేక, అవి చర్మంపై మొటిమలు, దద్దుర్లు లేదా ఎగ్జిమా రూపంలో కనిపిస్తాయి. దీనినే ‘గట్-స్కిన్ యాక్సిస్’ అంటారు

తీపి తినాలనే కోరిక: పేగులలో ఉండే చెడు బ్యాక్టీరియా చక్కెరను ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి, పేగులలో వాపు ఉన్నప్పుడు, ఆ బ్యాక్టీరియా మిమ్మల్ని ఎక్కువగా తీపి పదార్థాలు తినేలా ప్రేరేపిస్తుంది.

నిరంతర అలసట, నిద్రలేమి: శరీరంలోని ‘సెరోటోనిన్’ (సంతోషాన్నిచ్చే హార్మోన్) లో 90% ప్రేగులలోనే తయారవుతుంది. పగులలో వాపు ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గి, మీకు నిద్ర పట్టకపోవడం లేదా రోజంతా నీరసంగా అనిపించడం జరుగుతుంది.

ఆహార అసహనం : కొన్ని రకాల ఆహారాలు (ఉదాహరణకు పాలు లేదా గ్లూటెన్) తిన్నప్పుడు కడుపులో నొప్పి లేదా వికారం కలుగుతుంటే.. మీ పేగుల గోడలు బలహీనపడి వాపుకు గురయ్యాయని అర్థం.

Also Read: కుడి వైపు తలనొప్పి.. ఇది సాధారణ టెన్షనా లేక మైగ్రేనా? ఎలా గుర్తించాలి ?

నివారణ మార్గాలు :

పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ కింది మార్పులు చేసుకోండి.

ప్రోబయోటిక్స్ తీసుకోండి: పెరుగు, మజ్జిగ వంటి పదార్థాల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పేగుల వాపును తగ్గిస్తుంది.

పీచు పదార్థం : పండ్లు, ఆకుకూరలు , తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

నీరు ఎక్కువగా తాగాలి: శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి , ప్రేగుల గోడలను ఆరోగ్యంగా ఉంచడానికి నీరు చాలా అవసరం.

ఒత్తిడి తగ్గించుకోండి: ధ్యానం లేదా యోగా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి,పేగులు ప్రశాంతంగా ఉంటాయి.

ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరం: ప్యాక్ చేసిన ఫుడ్స్, అధిక చక్కెర ఉన్న పదార్థాలు ప్రేగులలో వాపును పెంచుతాయి.. కాబట్టి వాటిని నివారించండి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×