E-Paper
Advertisement

Chia Seeds: మలబద్ధకం ఇబ్బంది పెడుతోందా ? చియా సీడ్స్‌తో చెక్ పెట్టండిలా

Chia Seeds: మలబద్ధకం ఇబ్బంది పెడుతోందా ? చియా సీడ్స్‌తో చెక్ పెట్టండిలా
Advertisement

Chia Seeds: సూపర్ ఫుడ్స్‌లో ఒకటైన చియా విత్తనాలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ప్రియుల ఆదరణ పొందుతున్నాయి. చిన్నగా కనిపించే ఈ విత్తనాల్లో అనంతమైన పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగు పరచడంలో, పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఫైబర్, ప్రోటీన్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చియా సీడ్స్ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుచుకోవచ్చో ఇప్పుడి తెలుసుకుందాం.

జీర్ణక్రియకు ప్రాణం పోసే చియా విత్తనాలు:
చియా విత్తనాలు కేవలం బరువు తగ్గడానికే కాదు. శరీరంలోని ప్రతి వ్యవస్థను చైతన్యవంతం చేయడానికి తోడ్పడతాయి. పేగుల ఆరోగ్యం నుంచి గుండె ఆరోగ్యం వరకు ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు.

Advertisement

1. అద్భుతమైన ఫైబర్ నిధి:
చియా విత్తనాల్లో దాదాపు 40% వరకు ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరచడమే కాకుండా.. పేగులలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయ పడుతుంది. తద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

2. మలబద్ధకం నుంచి ఉపశమనం:
ఈ విత్తనాలను నీటిలో నాన బెట్టినప్పుడు అవి జెల్ లాగా మారుతాయి. ఈ జెల్ పదార్థం పేగులలో వ్యర్థాలు సులభంగా కదిలేలా చేసి, మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా నివారిస్తుంది.

Advertisement

3. ప్రేగుల వాపును తగ్గిస్తుంది:
చియా విత్తనాల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి పేగులలో కలిగే మంట లేదా వాపును తగ్గించి, అల్సర్లు లేదా ఇతర జీర్ణకోశ వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి.

4. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ :
వీటిలోని ఫైబర్ , ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే కాకుండా, రోజంతా శక్తివంతంగా ఉండాలనుకునే వారికి కూడా మేలు చేస్తుంది.

5. గుండె ఆరోగ్యానికి రక్షణ :
చియా విత్తనాల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. ఇది రక్తపోటును అదుపులో ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6. ఎముకల బలానికి తోడ్పాటు:
పాలు తాగని వారికి చియా విత్తనాలు ఒక గొప్ప ప్రత్యామ్నాయం. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచడానికి ఎంతో అవసరం.

AlSO Read: కిడ్నీలు పదిలంగా ఉండాలా? ఈ 5 అలవాట్లు మార్చుకోండి !

7. బరువు నియంత్రణ:
చియా విత్తనాలు నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి. దీని వల్ల వీటిని తీసుకున్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి.. బరువు తగ్గాలనుకునే వారికి సహాయ పడుతుంది.

ఎలా తీసుకోవాలి ?
చియా విత్తనాలను నేరుగా తినడం కంటే.. కనీసం 15-20 నిమిషాల పాటు నీటిలో లేదా పాలలో నానబెట్టి తీసుకోవడం ఉత్తమం. వీటిని స్మూతీలు, పెరుగు, లేదా సలాడ్లపై చల్లుకుని కూడా ఆస్వాదించవచ్చు.

Related News

చికెన్‌పాక్స్ మచ్చలతో ఇబ్బందిపడుతున్నారా? ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి టిప్స్

ఆలూ సమోసా ఇంట్లోనే ఇలా చేశారంటే.. ఇక బయట అస్సలు కొనరు!

ఓవెన్ అవసరం లేదు.. కుక్కర్‌లోనే మెత్తటి చాక్లెట్ కేక్ ఇలా తయారు చేసేయండి!

అచ్చం గుడి ప్రసాదం లాంటి రవ్వ కేసరి రావాలంటే.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు!

బ్లడ్ రిపోర్టులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా? ఈ 5 ఫుడ్స్ ఈ రోజే తినడం ప్రారంభించండి

చాణక్య నీతి.. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి 7 మార్గాలు

షుగర్ అదుపులో ఉండాలంటే అన్నం ఒక్కటి మానేస్తే సరిపోతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

“మా అబ్బాయి ఏ తప్పూ చేయడు”.. కొడుకుని అతిగా గారబం చేస్తే ఎదురయ్యే సమస్యలివే!

Big Stories

Advertisement
×