E-Paper
Advertisement

Mega 158: బాబీ దర్శకత్వంలో రాబోతున్న మెగాస్టార్ సినిమా క్యాన్సిల్!.. ఏం జరిగిందంటే?

Mega 158: బాబీ దర్శకత్వంలో రాబోతున్న మెగాస్టార్ సినిమా  క్యాన్సిల్!.. ఏం జరిగిందంటే?
Advertisement

Mega 158: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో రాబోతున్న ‘మెగా 158’ చిత్రంపై తాజాగా ఒక కీలకమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ (Vridhhi Cinemas) సంస్థ నిర్మించబోతోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో, వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమైంది. అయితే కేవీఎన్ ప్రొడక్షన్ లో ఈ సినిమా ఎందుక ఆగిపోయింది అన్నదానికి చాలా  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దళపతి ‘జననాయగన్’ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాను కేవీఎన్ నిర్మాతలు వదులుకున్నట్లు తెలుస్తుంది. జననాయగన్ విజయ్ చివరి సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అత్యంత భారీగా చేశారు. కానీ ఈ సినిమా ఇప్పటి వరకూ సెన్సార్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. అందుకే ‘మెగా 158’ నిర్మాతలు మారినట్లు తెలుస్తోంది.

Read also-Suhas Interview: నువ్వు హీరోవా అన్న ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పిన సుహాస్.. అంతేగా!

Advertisement

ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి చిత్ర యూనిట్ ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరలోనే (Month End) ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ కానుంది. పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా ప్రారంభించి, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ ఈసారి కూడా మెగాస్టార్ కోసం ఒక పక్కా మాస్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. వింటేజ్ చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి టెక్నీషియన్స్, ఇతర నటీనటుల వివరాలను ఓపెనింగ్ రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Read also-Podarillu Kesava: ‘పొదరిల్లు’ కేశవ బ్యాగ్రౌండ్ ఏంటి..?ఒక్కరోజు రెమ్యూనరేషన్?

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×