E-Paper
Advertisement

14 Days Without Sugar: షుగర్ మానేసిన 14 రోజుల్లోనే బరువు తగ్గడం సాధ్యమా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

14 Days Without Sugar: షుగర్ మానేసిన 14 రోజుల్లోనే బరువు తగ్గడం సాధ్యమా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?
Advertisement

14 Days Without Sugar: చక్కెర 14 రోజుల పాటు తీసుకోకపోతే మన శరీరంలో జరిగే మార్పులు ఆశ్చర్యకరంగా ఉంటాయి. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, AIIMS వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం.. చక్కెరను మానేయడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా.. కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.అంతే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఈ 14 రోజుల ప్రయాణంలో మీ శరీరంలోని ప్రతి అవయవం ఎలా స్పందిస్తుందో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో జరిగే అద్భుత మార్పులు..
చక్కెర మన శరీరానికి ఇంధనం ఇస్తుంది. కానీ అది ‘ఖాళీ కేలరీల’ రూపంలో ఉంటే.. అది విషంతో సమానం. కేవలం రెండు వారాల పాటు పంచదారకు దూరంగా ఉంటే.. మీ జీర్ణవ్యవస్థ, జీవక్రియలో అనేక మార్పులు కలుగుతాయి.

Advertisement

మొదటి 3 రోజులు:
చక్కెరను మానేసిన మొదటి 48 నుంచి 72 గంటలు కొంచెం కష్టంగా ఉంటాయి. చక్కెర మెదడులో ‘డోపమైన్’ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. అది ఆగిపోయినప్పుడు..
మీకు విపరీతమైన నీరసం, తలనొప్పి రావచ్చు. అంతే కాకుండా చక్కెర తినాలనే కోరిక బలంగా ఉంటుంది. కానీ.. ఈ దశను దాటితే మీ శరీరం చక్కెరపై ఆధారపడటం మాని, నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది.

4 నుంచి 7 రోజులు:
ఒక వారం పూర్తయ్యేసరికి.. మీ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలు క్రమబద్ధీకరించబడతాయి. భోజనం చేసిన తర్వాత వచ్చే నిద్రమత్తు తగ్గుతుంది. రోజంతా స్థిరమైన శక్తిని కలిగి ఉంటారు. చక్కెర వల్ల కలిగే వాపు తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.

Advertisement

8 నుంచి 14 రోజులు:
రెండవ వారం ముగిసే సమయానికి.. మీ శరీరం లోపల లోతైన మార్పులు జరుగుతాయి. చక్కెర మానేసినప్పుడు కాలేయం తన చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకుంటుంది. గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం.. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి ఇది గొప్ప ఉపశమనం. చక్కెర పేగుల్లోని చెడు బ్యాక్టీరియాకు ఆహారం. దానిని ఆపేయడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇన్సులిన్ స్థాయిలు తగ్గడం వల్ల శరీరం నీటి నిల్వలను బయటకు పంపుతుంది. అంతే కాకుండా కేవలం 14 రోజుల్లోనే 1 నుంచి 2 కేజీల బరువు తగ్గే అవకాశం ఉంది.

మెదడు పనితీరు: మెదడులో వాపు తగ్గుతుంది. దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది.

Also Read: దానిమ్మ రసం తాగితే గుండెలో బ్లాక్స్ మాయమవుతాయా ? నిజానిజాలు ఇవే!

నిపుణుల సూచనలు:

హార్వర్డ్, AIIMS నిపుణులు సూచించే కొన్ని కీలక అంశాలు:

సహజ చక్కెరలు: పండ్లలో ఉండే చక్కెర పర్వాలేదు. కానీ ప్యాక్ చేసిన స్వీట్లు, సోడాలు, తెల్లటి పంచదారను పూర్తిగా నివారించాలి.

నీరు ఎక్కువగా తాగాలి: చక్కెర మానేసినప్పుడు వచ్చే తలనొప్పిని తగ్గించడానికి తగినంత నీరు తాగడం ముఖ్యం.

ప్రోటీన్ , ఫైబర్: ఆకలి వేయకుండా ఉండటానికి గుడ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

Related News

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

Big Stories

Advertisement
×