E-Paper
Advertisement

Markapuram District: చంద్రబాబు ‘మార్కాపురం’ మాస్టర్ ప్లాన్.. జిల్లా ఏర్పాటు వెనుక ఉన్న అసలు లెక్కలివే!

Markapuram District: చంద్రబాబు ‘మార్కాపురం’ మాస్టర్ ప్లాన్.. జిల్లా ఏర్పాటు వెనుక ఉన్న అసలు లెక్కలివే!

Markapuram District: కొత్త జిల్లా ఏర్పాటుతో మార్కాపురం జిల్లాలో అధికార టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అస‌లు మార్కాపురం జిల్లా ఏర్పాటు వెనుక ఉన్న తెలుగుదేశం పార్టీ లెక్కలేంటి? క‌చ్చితంగా మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాల్సిందే అని టీడీపీ బ‌లంగా ఫిక్స్ అవ‌టానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి?.. ఆ ప్రాంత ప్ర‌జ‌ల సెంటిమెంటా?.. లేకపోతే అక్కడ వైసీపీని నామరూపాలు లేకుండా చేసి తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికా? అసలు వెనుకబడ్డ జిల్లా ఏర్పాటు క్రెడిట్ టీడీపీకి ఎంత వరకు ప్ల‌స్ అవుతుంది ?

మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు

కూట‌మి ప్ర‌భుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమ ప్ర‌కాశం జిల్లాలో ఉన్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌లిపి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది.. మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ఆయా నియోజక వర్గాల్లో టీడీపీ బలం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది…. ఎంతో కాలంగా ఈ ప్రాంత ప్ర‌జ‌ల సెంటిమెంట్‌తో ముడిప‌డి ఉన్న‌ కొత్త జిల్లా ఏర్పాటు వెనుక అంత‌ర్లీనంగా టీడీపీకి పెద్ద ప్లానింగే ఉంద‌ని రాజ‌కీయ ప‌రిశీలకులు భావిస్తున్నారట.. ఒకప్పుడు క‌ర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న మార్కాపురం 1970లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం జిల్లాలో కలిసింది..

వైవిధ్యభరిత మార్కాపురం జిల్లాకు గ్రీన్ సిగ్నల్

రాయలసీమ నుంచి వేరుపడిన మార్కాపురం ప్రాంతం జిల్లా కేంద్రం ఒంగోలుకు సుదూరంగా ఉండటం వల్ల అభివృద్ధిలో వెనుకబడిందనే అసంతృప్తి ఈ ప్రాంత ప్ర‌జ‌ల నుంచి నిత్యం వ్యక్తం అవుతూనే ఉంది. దీంతో గ‌త ఐదు ద‌శాబ్దాలుగా ప్రత్యేక జిల్లా కోసం పశ్చిమ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంత వాసులు ఉద్యమిస్తూనే ఉన్నారు.. ఎట్టకేలకు వారి డిమాండ్ ను టిడిపి ప్రభుత్వం నెరవేర్చింది. ఈ జిల్లా పరిధిలో మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. అది సీఎం చంద్రబాబు ఎన్నికల హామీ కూడా కావడంతో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్.

పశ్చిమ ప్రాంత ప్రత్యేక జిల్లా డిమాండ్ ఉద్భవం

వైసీపీ ప్రభుత్వ సమయంలో కూడా మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినా అప్పటి ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనే ప్రతిపాదనకే కట్టుబడి ఉండటంతో మార్కాపురం జిల్లా ఏర్పాటు సాధ్యం కాలేదు. అప్పట్లో వైసీపీప్రజా ప్రతినిధులు కూడా అధిష్టానాన్ని కాదని ఏమీ మాట్లాడలేని పరిస్థితి. కనీసం వారు ధైర్యం చేసి ప్రజల పోరాటానికి మద్దతు కూడా తెలపలేకపోయారు. మార్కాపురం ప్రాంతానికి.. జిల్లా కేంద్రం ఒంగోలు సుదూరంగా ఉండటం సమస్యగా మారి పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్‌ ఉద్భవించింది..

కంచుకోటలుగా మారిన మార్కాపురం చుట్టుప్రక్కల నియోజకవర్గాలు

మార్కాపురం ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే అధికారులకు, ప్రజాప్రతి నిధులకు రోజంతా సరిపోతుంది.. దీంతో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు మార్కాపురం జిల్లా ఏర్పాటు సాధన సమితి పేరుతో పార్టీలకతీతంగా ప్రజలు ఐక్యకార్యాచరణతో ఆందోళన చేపట్టారు. కొన్నినెలల పాటు ఉద్యమం సాగినా మార్కాపురం జిల్లా ఏర్పాటు కాలేదు. మ‌రోవైపు గత కొంతకాలంగా ప‌శ్చిమ ప్రాంతంపై వైసీపీ ఆధిపత్యం కొన‌సాగుతూ వ‌స్తుంది. గ‌తంలో కాంగ్రెస్.. ఆ త‌ర్వాత వైసీపీకి మార్కాపురం, ఎర్ర‌గొండ‌పాలెం, గిద్దలూరు, క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గాలు కంచుకోట‌లుగా మారిపోయాయి.

చంద్రబాబు హామీలు స్థానిక వాసుల మద్దతు

ఈ నేప‌ధ్యంలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ప్రాంతంలో ప్ర‌చారానికి వ‌చ్చిన చంద్ర‌బాబు స్థానిక ప్రజల అభీష్టం మేరకు వ్యూహాత్మ‌కంగా మ‌ర్కాపురం జిల్లా ఏర్పాటు హామీని ఇవ్వటంతో పాటు వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కేవ‌లం ఎర్ర‌గొండ‌పాలెం మిన‌హా మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఎన్నిక‌ల హామీ మేర‌కు సీఎం చంద్రబాబు ఈ ప్రాంత వాసుల మనోభీష్టానికి అనుగుణంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌టంతో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుతోపాటు పాల‌న మొద‌లైంది.. ప్రస్తుతం టీడీపీ గెలుచుకున్న మ‌ర్కాపురం, గిద్ద‌లూరు, క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గాలు గతంలో కాంగ్రెస్‌కు.. ఆ త‌ర్వాత వైసీపీకి కంచుకోట‌ల్లా ఉండేవి.

ప్రత్యేక జిల్లా హామీతో టీడీపీకి ప్రజల పట్టం

అయితే ప్రజలు తమ అవిష్టాన్ని గౌరవిస్తూ చంద్రబాబు ప్రత్యేక జిల్లా హామీ ఇవ్వడంతో అక్కడి ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. దీంతో ప్రజలు ఇచ్చిన ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి… ఆ నియోజకవర్గాలలో తిరుగులేని పట్టును సాధించేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది… వెనుకబడిన జిల్లాని అభివృద్ధి పథంలో నిలిపి పార్టీకి కంచుకోటంలా మార్చడంపై అధిష్టానం దృష్టి పెట్టిందట… అందులో భాగంగా అక్కడి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టును కూడా త‌మ హ‌యాంలోనే పూర్తి చేయడానికి వేగంగా పావులు కదుపుతుందట….

రెడ్డి సామాజిక వర్గ ఓటు బ్యాంక్ టీడీపీకి బాట

మార్కాపురం, గిద్ద‌లూరు, క‌నిగిరి, ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీసాంప్ర‌దాయ‌బ‌ద్దంగా వ‌చ్చే రెడ్డి సామాజిక వ‌ర్గ ఓటు బ్యాంకుతో విజయాలు సాధించింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ మార్కాపురంలో కందుల నారాయ‌ణ‌రెడ్డి, గిద్ద‌లూరులో ముత్తుముల అశోక్ రెడ్డి, క‌నిగిరిలో ముక్కు ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డిల‌కు సీట్లు ఇచ్చి ఆ సామాజిక వ‌ర్గ ఓట్ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని జెండా పాత‌గలిగింది.. మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలో 2004 త‌ర్వాత మొద‌టి సారి టీడీపీ అక్క‌డ గెలిచింది.. గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా 2001 ఉప ఎన్నిక‌ల్లోనే చివ‌రిసారి టీడీపీ గెలిచింది.. క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో కూడా 2014 త‌ర్వాత మ‌రోసారి 2024 లో గెలిచింది..

మార్కాపురం ప్రత్యేక జిల్లా.. టీడీపీకు పాజిటివ్ సైన్‌

ఓవైపు మార్కాపురం ప్ర‌త్యేక జిల్లా హామీతో పాటు రెడ్డి సామాజిక వ‌ర్గ అభ్య‌ర్దుల‌తో వ‌ర్క‌వుట్ చేసిన టీడీపీ వచ్చే సారి కూడా అదే త‌ర‌హా ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేసే అవ‌కాశం ఉందట….మ‌ర్కాపురం జిల్లా ఏర్పాటు,, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత ప్ర‌జ‌ల్లో పాజిటివ్ సైన్ తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు భావిస్తున్నారు ప‌రిశీల‌కులు.. మ‌ర్కాపురం జిల్లా ఏర్పాటు అంశంతో పాటు వెలుగొండ అంశాన్ని వీలైనంత వ‌ర‌కూ ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌టం ద్వారా పార్టీకి కూడా మంచి మైలేజ్ తీసుకువ‌చ్చి, రానున్న ఎన్నిక‌ల్లో కూడా పాజిటివ్ ఓటు బ్యాంక్ పొందాల‌నే ఆలోచ‌న చేస్తోందంట …దీంతో అటు మార్కాపురం జిల్లా లోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు ఒంగోలు పార్ల‌మెంటు స్థానంలో కూడా మరింత బలం పెరుగుతుందని టీడీపీ అంచ‌నా వేసుకుంటోందంట..

మార్కాపురం జిల్లా–వైసీపీ వ్యూహాల పరీక్ష

మార్కాపురం జిల్లా ఏర్పాటుతో అటు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్న‌ట్లు అవ‌టంతో పాటు, ఇటు జిల్లాను ఇచ్చిన సింప‌తీతో రాజ‌కీయంగా కూడా త‌మ‌కు ఉప‌యోగం ఉంటుంద‌ని టీడీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయంట. నిన్న మొన్నటి వరకు ఎక్కువగా నియోజకవర్గాలలో కనపడని టీడీపీ నేతలు కూడా నియోజకవర్గాలకు పూర్తి టైం కేటాయిస్తూ .. స్థానిక సంస్ధల ఎన్నికల్లో లబ్ది పొందడానికి ప్రజలతో మమేకమవుతున్నారట…. నూతన జిల్లా ఏర్పాటు తో పాటు , జిల్లా అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే పశ్చిమ ప్రాంత వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయటంపై కూడా పార్టీ అధిష్టానం గట్టిగానే దృష్టి పెట్టి, ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసిందట…. దీంతో కొత్త జిల్లాలో భవిష్యత్తు అంతా తమదే అని తెలుగుతమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మరి దీనిని ఎదుర్కొనేందుకు వైసీపీ కూడా వ్యూహాలను రచిస్తుందట….. మ‌రి మార్కాపురం జిల్లా క్రెడిట్ టీడీపీకి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుంది?.. టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ ఏం చేస్తుంద‌నేది చూడాలి.

Story by: Apparao , Big Tv

ALSO READ: వ్యూహమా? విద్వంసమా?..కవిత ‘ఆత్మగౌరవ’ పోరు.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పవర్ సెంటర్!

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×