E-Paper
Advertisement

Odisha Crime: ఛీ ఛీ.. అసలు వీడు తండ్రేనా.. కన్నకూతురిపై కన్నేసిన కామాంధుడు!

Odisha Crime: ఛీ ఛీ.. అసలు వీడు తండ్రేనా..  కన్నకూతురిపై కన్నేసిన కామాంధుడు!
Advertisement

Odisha Crime: నిజంగా ఇది కలికాలమే.. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, ఆమె పాలిట మృగమయ్యాడు. మానవత్వాన్ని మంటగలుపుతూ, కన్నప్రేమకే మాయని మచ్చ తెచ్చిన ఈ అమానుష ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. కామాంధుడికి కళ్లు ఉండవని అంటారు కానీ, ఇక్కడ తండ్రి అనే బాధ్యత కూడా ఆ కామంతో కనుమరుగైపోయింది.

ఒడిశాలోని ధెంకనాల్‌ జిల్లాకు చెందిన 59 ఏళ్ల వ్యక్తికి 21 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె పుట్టుకతోనే దివ్యాంగురాలు. కనీసం తన బాధను చెప్పుకోలేని ఆ యువతి బలహీనతను ఆసరాగా చేసుకున్న ఆ కిరాతకుడు, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బయటి వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాల్సిన చేతులే.. ఆమెను నరకంలోకి నెట్టేశాయి.

Advertisement

అయితే.. కొద్దిరోజుల తర్వాత ఆ యువతి గర్భం దాల్చడంతో ఈ దారుణం బయటపడింది. అది చూసి స్థానికులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. తన సొంత తండ్రే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. బాధితురాలి పరిస్థితిని చూసి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నిందితుడిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Also Read:రీల్స్ పిచ్చి.. నోట్లో నాగుపాము తల పెట్టుకుని స్టంట్.. చివరికి ఏమైందంటే?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×