E-Paper
Advertisement

జ్ఞాపకశక్తి తగ్గుతోందా? మెదడుకు ‘సూపర్ పవర్’ ఇచ్చే 5 డైలీ హ్యాబిట్స్ ఇవే!

జ్ఞాపకశక్తి తగ్గుతోందా? మెదడుకు ‘సూపర్ పవర్’ ఇచ్చే 5 డైలీ హ్యాబిట్స్ ఇవే!
Advertisement

Brain Health Tips: మనం శరీర ఫిట్‌నెస్ కోసం ఇచ్చే ప్రాధాన్యత మన మెదడుకు ఇస్తున్నామా? వయసు పెరుగుతున్న కొద్దీ విషయాలు మర్చిపోవడం సహజమని చాలా మంది అనుకుంటారు. కానీ.. వాస్తవానికి మన లైఫ్ స్టైల్ లో చేసే చిన్న చిన్న మార్పులతో మెదడును ఎప్పుడూ చురుగ్గా, యవ్వనంగా ఉంచుకోవచ్చు. జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి సమస్యల నుంచి బయటపడి, మీ మేధస్సును రెట్టింపు చేసే 5 అద్భుతమైన లైఫ్ స్టైల్ చిట్కాలను గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

1. సరైన పోషకాహారం :
మనం తినే ఆహారం నేరుగా మెదడు పని తీరుపై ప్రభావం చూపుతుంది. మెదడులో 60% కొవ్వు ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.

Advertisement

ఏం తినాలి?:ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్‌నట్స్ (అక్రోట్లు), అవిసె గింజలు, చేపలు మెదడు కణాల నిర్మాణానికి తోడ్పడతాయి.

యాంటీ ఆక్సిడెంట్స్:బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లు మెదడులోని వాపును తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే.. డార్క్ చాక్లెట్ , గ్రీన్ టీ ఏకాగ్రతను పెంచుతాయి.

Advertisement

2. శారీరక వ్యాయామం:
రోజూ వ్యాయామం చేయడం వల్ల కేవలం కండరాలు మాత్రమే కాదు.. మెదడు కూడా బలపడుతుంది. వ్యాయామం చేసినప్పుడు మెదడులో.. ‘BDNF’అనే ప్రోటీన్ విడుదలవుతుంది. ఇది కొత్త కణాల ఉత్పత్తికి, పాత కణాల మరమ్మతుకు సహాయ పడుతుంది.

చిట్కా:రోజుకు కనీసం 30 నిమిషాల వేగంగా నడవడం లేదా యోగా చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి, ఆలోచనా శక్తి మెరుగు పడుతుంది.

3. గాఢ నిద్ర:
మనం నిద్రపోతున్నప్పుడు మెదడు విశ్రాంతి తీసుకోదు.. బదులుగా అది ‘క్లీనింగ్’ పనిలో ఉంటుంది. రోజంతా పేరుకుపోయిన అనవసరమైన సమాచారాన్ని తొలగించి, ముఖ్యమైన విషయాలను జ్ఞాపక శక్తిగా భద్రపరుస్తుంది.

నియమం: రాత్రిపూట 7-8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. నిద్ర లేకపోతే మెదడు కణాలు అలసిపోయి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పడిపోతుంది.

Also Read: ఆఫీస్ కుర్చీలో ‘సైలెంట్ కిల్లర్’.. ఈ 2 నిమిషాల ట్రిక్ మీ వెన్నెముకకు శ్రీరామరక్ష!

4. నిరంతర అభ్యసనం:
మెదడు ఒక కండరం లాంటిది. దానికి ఎంత పని చెబితే అంత పదునుగా మారుతుంది. ఒకే రకమైన పనులు చేయడం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది.

ఏం చేయాలి?: కొత్త భాష నేర్చుకోవడం, పజిల్స్ పూర్తి చేయడం, సుడోకు ఆడటం లేదా ఏదైనా సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడం వంటివి చేయండి. ఇవి మెదడులో కొత్త ‘న్యూరల్ పాత్‌వేస్’ను సృష్టిస్తాయి, దీనివల్ల వయసుతో వచ్చే మతిమరుపు దరిచేరదు.

5. ఒత్తిడి:
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల విడుదలయ్యే ‘కార్టిసోల్’ హార్మోన్ మెదడులోని జ్ఞాపక శక్తి కేంద్రమైన ‘హిప్పోకాంపస్’ను దెబ్బ తీస్తుంది.

పరిష్కారం: ప్రతిరోజూ 10 నిమిషాల ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది. నలుగురితో కలిసి సమయం గడపడం, సామాజికంగా యాక్టివ్‌గా ఉండటం కూడా మానసిక ఉల్లాసాన్ని ఇచ్చి మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×