E-Paper
Advertisement

Morning Habits: యవ్వనాన్ని దూరం చేసే 5 తప్పుడు అలవాట్లు.. మీరూ ఇలా చేస్తున్నారా?

Morning Habits: యవ్వనాన్ని దూరం చేసే 5 తప్పుడు అలవాట్లు.. మీరూ ఇలా చేస్తున్నారా?
Advertisement

Morning Habits: వయసు పెరగడం అనేది ప్రకృతి సిద్ధమైన ప్రక్రియ.కానీ మన అలవాట్ల వల్ల కొందరిలో ఆ లక్షణాలు చాలా త్వరగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం చేసే కొన్ని పనులు మన చర్మాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీసి, మనల్ని ఉన్న వయసు కంటే పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి.త్వరగా ముసలితనం రాకుండా ఉండాలంటే ఉదయాన్నే మానుకోవాల్సిన 5 ముఖ్యమైన అలవాట్లను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం:
చాలా మందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ.. ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది చర్మంలోని కొల్లాజెన్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మంపై ముడతలు వస్తాయి. అంతేకాకుండా.. కెఫిన్ శరీరంలోని తేమను తగ్గించి చర్మం పొడి బారిపోయేలా చేస్తుంది.

Advertisement

పరిష్కారం: ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగిన తర్వాతే కాఫీ లేదా టీ తీసుకోవాలి.

2. సూర్యరశ్మి నుంచి రక్షణ:
ఉదయం ఎండ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. ఉదయం 9 గంటల తర్వాత వచ్చే ఎండలో UV కిరణాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఇంట్లోనే ఉంటున్నాం కదా అని సన్‌స్క్రీన్ వాడరు. కిటికీల నుంచి వచ్చే ఎండ కూడా చర్మంపై పిగ్మెంటేషన్, ముడతలకు కారణమవుతుంది.

Advertisement

పరిష్కారం: ఉదయం స్నానం చేసిన వెంటనే నాణ్యమైన సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లై చేయడం మర్చిపోవద్దు.

3. చక్కెర ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్:
ఉదయం పూట పంచదార ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, బ్రెడ్ జామ్ లేదా తీపి పదార్థాలు తినడం వల్ల శరీరంలో ‘గ్లైకేషన్’అనే ప్రక్రియ జరుగుతుంది. రక్తంలోని చక్కెర అణువులు చర్మానికి మెరుపునిచ్చే ప్రోటీన్లతో కలిసిపోయి వాటిని బలహీన పరుస్తాయి. దీని వల్ల చర్మం సాగిపోయి, ముసలితనం త్వరగా వస్తుంది.

పరిష్కారం: అల్పాహారంలో ప్రోటీన్లు (గుడ్లు, మొలకలు) ఫైబర్ ఉండేలా చూసుకోండి.

4. తగినంత నీరు తాగకపోవడం:
రాత్రంతా నిద్రపోయిన తర్వాత మన శరీరం స్వల్పంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఉదయాన్నే తగినన్ని నీళ్లు తాగకపోతే చర్మ కణాలు కుంచించుకుపోయి, ముఖం కాంతి విహీనంగా మారుతుంది. నీరు తక్కువైతే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లవు, ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలకు దారి తీస్తుంది.

పరిష్కారం: నిద్ర లేవగానే కనీసం రెండు గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోండి.

Also Read: వామ్మో.. నిద్రలేమితో ఇన్ని సమస్యలా ? అస్సలు ఊహించలేరు !

5. స్మార్ట్‌ఫోన్ చూడటం, ఒత్తిడి:

కళ్లు తెరవగానే ఫోన్ చూసి సోషల్ మీడియా లేదా ఈమెయిల్స్ చెక్ చేయడం వల్ల మెదడుపై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి వల్ల ముఖ కండరాలు బిగుసుకుపోయి.. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాగే ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ చర్మ కణాలను దెబ్బతీస్తుంది.

పరిష్కారం: ఉదయం కనీసం మొదటి గంట సేపు ఫోన్‌కు దూరంగా ఉండి, ధ్యానం లేదా వ్యాయామం చేయండి.

యవ్వనంగా కనిపించడమనేది కేవలం సౌందర్య సాధనాలపైనే ఆధారపడి ఉండదు. అది మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్న తప్పుడు అలవాట్లను మార్చుకుని.. క్రమశిక్షణతో కొన్ని పద్ధతులను పాటిస్తే ఆరోగ్యంతో పాటు సహజమైన మెరుపు మీ సొంతమవుతుంది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×