E-Paper
Advertisement

గుండెను దెబ్బతీసే 6 అలవాట్లు.. వీటిని వెంటనే వదిలేయండి!

గుండెను దెబ్బతీసే 6 అలవాట్లు.. వీటిని వెంటనే వదిలేయండి!
Advertisement

Heart Health Alert: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి. కేవలం జన్యుపరమైన కారణాలే కాకుండా.. మన ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె పనితీరు నెమ్మదిస్తుంది. మనకు తెలియకుండానే.. మనం చేసే కొన్ని పనులు గుండెపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతాయి. ప్రాణాంతకమైన హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే.. మన గుండెను గాయపరిచే ఆ 6 ప్రధాన కారణాల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె. ఇది నిరంతరం రక్తాన్ని పంపిణీ చేస్తూ.. మనల్ని జీవించి ఉండేలా చేస్తుంది. అయితే.. మారుతున్న కాలంతో పాటు మనం అలవాటు చేసుకున్న కొన్ని చెడు అలవాట్లు ఈ ‘ఇంజిన్’ను మొరాయించేలా చేస్తున్నాయి. ఇంతకీ గుండెకు హాని కలిగించే విషయాలేంటో తెలుసుకుందామా..

Advertisement

1. నిరంతర ఒత్తిడి, ఆందోళన:
నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి సర్వసాధారణం. కానీ దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో ‘కార్టిసోల్’ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది రక్త పోటును పెంచి, రక్త నాళాలను దెబ్బతీస్తుంది. మనస్సు ప్రశాంతంగా లేకపోతే గుండె లయ తప్పుతుంది.

2. లైఫ్ స్టైల్:
గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం లేదా శారీరక శ్రమ లేకపోవడం గుండెకు పెద్ద శాపం. వ్యాయామం లేకపోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేకపోతే గుండె కండరాలు బలహీనపడతాయి.

Advertisement

3. అధిక సోడియం (ఉప్పు):
మనం తినే జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన చిప్స్ , నిల్వ పచ్చళ్లలో ఉప్పు అధికంగా ఉంటుంది. సోడియం రక్తంలో నీటి శాతాన్ని పెంచి, రక్త నాళాలపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల హైపర్‌టెన్షన్ ఏర్పడి, హార్ట్ ఫేయిల్యూర్‌కు దారితీస్తుంది.

4. నిద్రలేమి:
రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరం తనను తాను రీఛార్జ్ చేసుకోలేదు. నిద్ర తక్కువైతే రక్తపోటు పెరగడమే కాకుండా.. శరీరంలో వాపు పెరుగుతుంది. ఇది గుండె ధమనులను దెబ్బతీస్తుంది. ప్రతి మనిషికి కనీసం 7-8 గంటల గాఢ నిద్ర అవసరం.

Also Read: మతిమరుపుకు మందు అక్కర్లేదు.. ఒక్క గ్లాసు నీరు మీ మెదడును ఎలా మారుస్తుందో తెలుసా?

5. ఒంటరితనం, సామాజిక దూరం:
ఇది ఆశ్చర్యంగా అనిపించినా నిజం. ఒంటరితనంతో బాధపడేవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు 29% ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. సామాజిక బంధాలు తక్కువగా ఉన్నప్పుడు కలిగే డిప్రెషన్ గుండె ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది.

6. ప్రాసెస్ చేసిన ఆహారాలు , ట్రాన్స్ ఫ్యాట్స్:
బేకరీ ఐటమ్స్, వేయించిన ఆహార పదార్థాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ గుండెకు విషంతో సమానం. ఇవి ధమనుల గోడలపై పేరుకుపోయి రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. సహజ సిద్ధమైన పండ్లు, కూరగాయలు పక్కన పెట్టి కృత్రిమ రుచులకు అలవాటు పడటం గుండెకు చేసే అతిపెద్ద గాయం.

గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. పొగతాగడం, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ.. పైన పేర్కొన్న 6 విషయాల పట్ల జాగ్రత్త వహిస్తే మీ గుండె పదిలంగా ఉంటుంది. సరైన ఆహారం,వ్యాయామం, చిరునవ్వుతో కూడిన జీవితం మీ గుండె ఆరోగ్యానికి ముఖ్యం.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×