E-Paper
Advertisement

విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు, సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రులు

విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు, సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రులు
Advertisement

Vizag: ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలతో ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం . ఇప్పటికే ఆర్సెలార్‌ మిట్టల్-నిప్పన్‌ స్టీల్ ప్రాజెక్టుకు పునాదిరాయి పడింది. అక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు గూగుల్ వంతు అయ్యింది. గూగుల్ డేటా సెంటర్‌కు సంబంధించి పునాదిరాయి ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు

Advertisement

ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చకున్న సంస్థలు ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్-నిప్పన్‌ స్టీల్ ప్రాజెక్టుకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు గూగుల్ సంస్థ వంతైంది. డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం ఆరు నెలల కిందట కుదిరింది.

ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాలని గూగుల్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఏప్రిల్ 28న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతోపాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యే అవకాశముంది. గూగుల్‌ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తోపాటు ఆ సంస్థ ప్రతినిధులు హాజరుకానున్నారు.

Advertisement

సీఎం చంద్రబాబుతోపాటు పలువురు కేంద్రమంత్రులు హాజరు

1 గిగావాట్ సామర్థ్యం గల గూగుల్ డేటా సెంటర్‌ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది గూగుల్. దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. గూగుల్ డేటా సెంటర్ల కోసం విశాఖ సిటీలోని అడవివరం, తర్లువాడ, అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.

ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భూమిని అప్పగించింది ప్రభుత్వం. తర్లవాడ లేదా రాంబిల్లి ప్రాంతాల్లో తొలుత శంకుస్థాపన చేయాలని ఆ కంపెనీ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం రాంబిల్లిలో 174.8 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, తర్లవాడలో 266 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించింది.

ALSO READ: ఊహించని ప్లాన్ చేస్తున్న జగన్.. ఆ ఇద్దరు నేతలు వస్తే, ఇక కూటమికి చుక్కలు తప్పవా?

ఒక గిగావాట్ సామర్థ్యం గల మూడు డేటా సెంటర్లను 2028 జూలై నాటికి ప్రారంభించాలని ఓ అంచనా. డేటా సెంటర్ల ఏర్పాటులో భాగంగా మూడు అధిక సామర్థ్యం గల సబ్‌మెరైన్ కేబుళ్లు, ప్రత్యేక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు, అధిక సామర్థ్యం గల మెట్రో ఫైబర్ లైన్లు, టెలికమ్యూనికేషన్ల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

గూగుల్ దాని అనుబంధ సంస్థలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది. అందులో అమెరికా, తైవాన్, జపాన్, సింగపూర్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, బెల్జియం, చిలీ వంటి దేశాల్లో డేటా సెంటర్లు ఉన్నాయి. అయితే విశాఖలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ క్లస్టర్ ఆసియాలో అతిపెద్దదిగా చెబుతున్నారు ఆ సంస్థ ప్రతినిధులు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×