E-Paper
Advertisement

యంగ్ లుక్స్ కోసం కాఫీ బటర్ క్రీమ్.. ఇలా ఉపయోగించండి

యంగ్ లుక్స్ కోసం కాఫీ బటర్ క్రీమ్.. ఇలా ఉపయోగించండి
Advertisement

ఇటీవల కాఫీ బటర్ క్రీమ్ ట్రెండింగ్‌లో ఉంది. అందంగా కనిపంచాలని కోరుకునే చాలా మంది ఇప్పుడు కాఫీ బటర్ ఉపయోగిస్తున్నారు. కాఫీ గింజలు నుంచి తీసిన నూనెలు, నేచురల్ బటర్లతో తయారు చేస్తారు. కోకోవా బటర్, కాఫీ ఆయిల్, కొన్ని సహజ నూనెలు కలిపి ఈ క్రీమ్‌ని తయారు చేస్తారు. ఈ కాఫీ బటర్.. లోషన్లు, లిప్ బామ్‌లు, బాడీ క్రీమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే సొంతంగా స్కిన్‌కేర్ ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.

చర్మంలో తేమను కాపాడే కాఫీ బటర్

పొడి చర్మం ఎండిపోయి చాలా డ్రైగా కనిపిస్తుంది. కాఫీ బటర్ చర్మంలో తేమను బాగా లాక్ చేసి ఉంచుతుంది. కాఫీ బటర్ మృదువుగా ఉండడంతో చర్మం మీద ఒక రక్షణ పొరను సృష్టిస్తుంది. దీని వల్ల నీరు ఆవిరి బయటకు వెళ్లకుండా చేస్తుంది. రోజూ వాడితే మృదువుగా మారుతుంది. శీతాకాలంలో పొడి చర్మం ఉన్నవారు ఇది ఎక్కువగా ఉపయోగించాలి.

కాఫీ బటర్ కళ్ల కింద నలుపు తగ్గిస్తుందా?

Advertisement

చాలా మందికి కళ్ల కింద నల్లటి వలయాలు సమస్యగా ఉంటాయి. కాఫీ బటర్ ఆ ప్రాంతాన్ని తేమతో నింపి, ఉపశమనం ఇస్తాయి. రోజూ మెల్లగా మసాజ్ చేస్తే కళ్లు కింద చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కాఫీలో ఉండే సహజ పదార్థాలు చర్మాన్ని రిఫ్రెష్ చేస్తాయి.

వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కాఫీ బటర్ పాత్ర

కాఫీ బటర్‌లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాఫీయిక్ యాసిడ్స్, క్లోరోజెనిక్ యాసిడ్స్, వంటి పదార్థాలు చర్మాన్ని బయట కాలుష్యం నుంచి రక్షిస్తాయి. ఇవి ముడతలు, పొడిబారడం తగ్గించి చర్మాన్ని గట్టిగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.

మొటిమల సమస్య ఉన్నవారికి కాఫీ బటర్ మంచిదా?

Advertisement

కాఫీ బటర్‌లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉండటం వల్ల మొటిమలు ఉన్న చర్మానికి సాయపడతాయి. ఇన్‌ఫెక్షన్, వాపు కారణంగా ఎర్రబడిన చర్మాన్ని శాంతపరుస్తుంది. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందు చిన్న ప్రాంతంలో పరీక్షించుకోవాలి.

అసమాన చర్మ రంగును మెరుగుపరుస్తుంది

కాఫీ బటర్.. చర్మం మీది మచ్చలు, నలుపును క్రమంగా తగ్గిస్తుంది. క్లోరోజెనిక్ యాసిడ్స్.. చర్మాన్ని ప్రకాశవంతం చేసి, సమానంగా కనిపించేలా చేస్తాయి.

ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది

కాఫీ బటర్‌ను కాఫీ గ్రౌండ్స్‌తో కలిపి స్క్రబ్‌గా వాడితే చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. ఇది రంధ్రాలను శుభ్రం చేసి, చర్మం మెరుగ్గా కనిపించడానికి దోహదపడుతుంది.

Also Read: ఇతరులు మీకు సాయం చేస్తారని ఆశించడమే మీ బాధలకు కారణం.. చాణక్యుడు చెప్పిన చేదు నిజాలు

కాఫీ బటర్ ఎలా వాడాలి?

ఫేస్ వాష్ చేసిన తర్వాత కాఫీ బటర్‌ను మృదువుగా మసాజ్ చేయాలి. మోకాళ్లు, కాలి మడమలు, మోచేతుల్లోని పొడి చర్మానికి బాగా పని చేస్తుంది. అందుకే క్వాలిటీ స్కిన్ కేర్ ఉత్పత్తులు ఎంపిక చేసుకోవాలి.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×