E-Paper
Advertisement

రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈవెంట్ జరిగేది ఎక్కడంటే?

రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈవెంట్ జరిగేది ఎక్కడంటే?
Advertisement

Peddi Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా భారీ చిత్రాల ఈవెంట్లను హైదరాబాద్ లేదా ఇతర మెట్రో నగరాల్లో నిర్వహిస్తుంటారు, కానీ ‘పెద్ది’ టీమ్ మాత్రం ఒక విభిన్నమైన, అర్థవంతమైన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నార్త్ ఇండియాలో నిర్వహఇంచేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఈవెంట్ భూపాల్ లో నిర్విహించనున్నారు.

Read also-యంగ్ నటీమణులపై పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు.. ఇది వేరే లెవెల్..

భోపాల్ గడ్డపై ‘పెద్ది’ జాతర

Advertisement

ఈ చిత్ర ప్రీ-రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నిర్వహించనున్నారు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. భోపాల్ నగరానికి వందల ఏళ్ల నాటి కుస్తీ సంస్కృతి ఉంది. అక్కడ ఇప్పటికీ ఖాట్లాపురా అఖాడా, గిన్నోరి అఖాడా వంటి చారిత్రాత్మక అఖాడాలు ఎంతో ప్రసిద్ధి. కేవలం గ్లామర్ కోసం మెట్రో నగరాలకు వెళ్లకుండా, కథలోని ‘క్రాఫ్ట్’ కు ‘లెగసీ’కి విలువనిస్తూ ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం పట్ల రామ్ చరణ్, బుచ్చిబాబులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మే 16, 2026న భోపాల్‌లో గ్రాండ్‌గా ‘పెద్ది’ ట్రైలర్ విడుదల కానుంది. ఈ వేడుకలో ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ప్రత్యక్షంగా సంగీత ప్రదర్శన ఇవ్వనుండటం విశేషం. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే కుస్తీ పోటీల చుట్టూ తిరుగుతుంది.

Read also-దుబాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌కి శోభితా ధూళిపాళ్ల రిప్లై వైరల్.. నెటిజన్లు ఫిదా..

Advertisement

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాలు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విదేశాల్లో కూడా ఇప్పటికే ఈ సినిమా టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. దీంతో మూవీ టీం సంబరాలు చేసుకుంటుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 4, 2026న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రెండు సార్టు పోస్ట్ పోన్ చేశారు. ఐటమ్ సాంగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల డిలే అయిందనది మూవీ టీం చెప్పుకొచ్చింది. ఎట్టకేలకు ఈ సారి సినిమాకు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంత భారీ స్థాయిలో విడుదల అవుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా చాట్ బాస్టర్లుగా నిలిచాయి.

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×