E-Paper
Advertisement

Health Tips: బెల్లం తినడం వల్ల ఇన్ని లాభాలా ?

Health Tips: బెల్లం తినడం వల్ల ఇన్ని లాభాలా ?
Advertisement

Health Benefits Of Jaggery : బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు కాస్త బెల్లం తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. బెల్లం అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అందుకే దీనిని పోషకాల గని అని అంటారు.

బెల్లంలో మెగ్నీషియం, ఇనుము, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అంతే కాకుండా శరీరానికి అవసరమైన విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. బెల్లం తినడం వల్ల శరీరానికి కావలసినంత శక్తి లభిస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. అలసట, నీరసం వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Advertisement

భోజనం చేసిన తర్వాత కాస్త బెల్లం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. కాలేయం ఎప్పుడూ డీహైడ్రేట్ కాకుండా బెల్లం కాపాడుతుంది. శరీరంలో ఉన్న టాక్సిన్లను బయటకు పంపి రక్తన్ని శుద్ధి చేయడానికి ఎంత గానో ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

కాస్త బెల్లాన్ని అల్లంతో కలిపి తినడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా బెల్లంలో ఐరన్ కంటెంట్ అధిక మోతాదులో ఉంటుంది. బెల్లం తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అనీమియా, ఐరన్ డెఫీషియన్సీ వంటి చికిత్సతో పాటు ఎర్ర రక్త కణాల ఉత్త్పత్తికి బెల్లం ఎంత గానో ఉపయోగపడుతుంది. బెల్లం బరువును నియంత్రిస్తుంది.

Advertisement

Also Read:మెరిసే ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి !

బరువు తగ్గాలనుకునే వారు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినవచ్చు. తక్కువ కేలరీలు, తీపిదనం కలిగి ఉండే బెల్లం బరువును నియంత్రణలో ఉంచుతుంది. అంతే కాకుండా బెల్లంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజు కొంచెం బెల్లం తింటే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×