Big Stories

Sundar Pichai: ఈ 20 ఏళ్లలో అన్నీ మారాయి.. ఆ ఒక్కటి తప్ప: సుందర్ పిచాయ్

Sundar Pichai Completed 20 years at Google: ప్రముఖ టెక్ దిగ్గజమైనటువంటి గూగుల్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థలో పనిచేయాలనే కోరిక టెకీలకు ఉంటుంది. అయితే, మన దేశానికి చెందిన సుందర్ పిచాయ్ అందులో 20 ఏళ్ల క్రితం చేరి సీఈఓ స్థాయికి ఎదిగారు. ఒక సాధారణ ఉద్యోగిగా గూగుల్ లో చేరి ఆ సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆండ్రాయిడ్, గూగుల్ క్రోమ్ వంటి ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. వర్క్ పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించి 2015లో గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ ని నియమించారు.

- Advertisement -

అయితే, సుందర్ పిచాయ్ ఇన్ స్టా గ్రామ్ లోని తన అకౌంట్ లో తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడా పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. తాను సీఈఓ స్థాయికి ఎలా వచ్చారనేదానిపై, అదేవిధంగా తన 20 ఏళ్ల గూగుల్ ప్రస్థానం గురించి అందులో వివరించారు.

- Advertisement -

తాను గూగుల్ లో చేరి 20 ఏళ్లు అవుతుందని.. ఈ 20 ఏళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని అందులో పేర్కొన్నారు. గూగుల్ లో ఏప్రిల్ 26, 2004 తనకు మొదటి రోజు అని, అప్పటి నుంచి ఎన్నో మార్పులు వచ్చాయని.. సాంకేతికతను, అదేవిధంగా గూగుల్ ఉత్పత్తులను వినియోగించేవారి సంఖ్య కూడా ఎంతగానో మారింది.. అలాగే తన జుట్టు కూడా మారిందని.. అయితే, ఈ 20 ఏళ్లలో ఒక అంశం మారలేదని.. అదేమంటే అద్భుతమైన గూగుల్ లో పనిచేస్తున్నప్పుడు తాను పొందే థ్రిల్ మాత్రం ఇప్పటికీ మారలేదు.. అలాగే ఉందని.. గూగుల్ కంపెనీలో భాగమైనందుకు ఎంతో అదృష్టవంతుడనని తాను భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 20 నెంబర్ ఉన్నటువంటి ఓ ఇమేజ్..అందులో 2004లో ఆయన గూగుల్ ప్రొడక్ట్ మేనజర్ గా చేరిన నాటి ఐడీకార్డు, ప్రస్తుత ఐడీ కార్డును పంచుకున్నారు.

Also Read: అమెరికాలో పల్టీలు కొట్టిన కారు.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

అయితే, ఈ పోస్ట్ ఎంతగానో ఆకట్టుకుంటూ వైరల్ గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ సుందర్ పిచాయ్ నిబద్ధతను ప్రశంసిస్తూ.. ఆదర్శమంటూ పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News