E-Paper
Advertisement

Dragon Fruit Benefits: మధుమేహం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. సూపర్ ఫుడ్‌గా నిలుస్తున్న డ్రాగన్ ఫ్రూట్!

Dragon Fruit Benefits: మధుమేహం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. సూపర్ ఫుడ్‌గా నిలుస్తున్న డ్రాగన్ ఫ్రూట్!
Advertisement

Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్.. పేరు వినగానే రంగురంగుల పండు గుర్తుకువస్తుంది. కానీ ఈ ఆకర్షణీయమైన ఫ్రూట్‌లో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇది శక్తివంతమైన సహజ ఆహారం అని నిపుణులు చెబుతున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంచడంలో ఇది సహాయపడుతుంది. అలాగే దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, రక్త చక్కెర నియంత్రణకు తోడ్పడుతుంది.

ఆరోగ్యకమైన పోషకాలు:

గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో డ్రాగన్ ఫ్రూట్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. మోనో సాచ్యురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, రక్తపోటు సమతుల్యం కావడంలో దీని పాత్ర కీలకం. జీర్ణ సమస్యలు, ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం లాంటి ఇబ్బందులు తరచు వచ్చేవారికి దీనిలోని డైటరీ ఫైబర్ ఉపశమనం కలిగిస్తుంది. పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడే పోషకాలు కూడా డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్నాయి.

Advertisement

Read Also: బ్లాక్ గ్రీన్‌లను మించి ‘వైట్ టీ’ హెల్త్ సీక్రెట్స్.. అందం, ఆరోగ్యం రెండూ ఒకే కప్పులో!

మంచి ఫిట్‌నెస్ పొందొచ్చు:

డ్రాగన్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల శరీరం ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షణ పొందుతుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లను అడ్డుకోవడంలో ఇది మద్దతు ఇస్తుంది. ఈ ఫ్రూట్‌లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక సహజ వరం. ఈ పండును తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. కాబట్టి దీంతో మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది.

చర్మానికి రక్షణ:

Advertisement

ఇకపోతే.. సౌందర్యాన్ని కాపాడటంలో డ్రాగన్ ఫ్రూట్‌కు మంచి మార్కులు ఇవ్వొచ్చు. అలాగే దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లోని భాస్వరం, మెగ్నీషియం ఎముకలు, దంతాలు బలపడేందుకు సహకరిస్తాయి. చర్మ సంరక్షణలో ముఖ్యమైన కొల్లాజెన్ ఉత్పత్తిని విటమిన్ సి పెంచి, వృద్ధాప్యం రాకుండా అడ్డుకుంటుంది. అలాగే కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు రక్షణ కవచంలా పనిచేస్తాయి.

Read Also: శీతాకాలంలో చిలగడదుంప ఎందుకు తినాలో తెలుసా?.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×