E-Paper
Advertisement

KAVITHA: బీఆర్ఎస్‌పై కవిత సంచలన విమర్శలు.. అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు అంటూ..?

KAVITHA: బీఆర్ఎస్‌పై కవిత సంచలన విమర్శలు.. అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు అంటూ..?
Advertisement

KAVITHA: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రోజు రోజుకీ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు చేసిన కవిత.. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా గులాబీ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ‘దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు’ అంటూ కార్యక్రమాలు నిర్వహించడంపై ఆమె వ్యంగ్యంగా స్పందించారు.

కవిత ఏమని ట్వీట్ చేశారంటే..?

Advertisement

‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు.. ఇది ఉద్యమాల గడ్డ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్న కవిత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కూడా కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు గులాబీ పార్టీ నాయకుల్లో మరింత ఆగ్రహానికి దారి తీశాయి.

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలే కవిత టార్గెట్

Advertisement

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జన జాగృతి – జనం బాట పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తున్న కవిత ఈ పర్యటనల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. ముఖ్యంగా ఇటీవల మాజీ మంత్రి మల్లారెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘పాలు అమ్మి, పూలు అమ్మి… వేల ఎకరాలు కబ్జా పెట్టాడని.. ఆయన వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదు’ అని కవిత తీవ్ర విమర్శలు చేశారు. అలాగే, మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావుల పాత్ర వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని గతంలో సంచలన ఆరోపణలు చేశారు. కూకట్‌పల్లి పర్యటనలో హైదరాబాద్ ఎమ్మెల్యేలను బిజినెస్, ట్రావెలింగ్ బ్యాచ్ గా అభివర్ణించి మరో వివాదాన్ని రేపారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు కాకుండా కేవలం డబ్బున్న వారికే మంత్రి పదవులు దక్కాయని ఆమె సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు..

కవితపై బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల ఫైర్

కవిత నిరంతర విమర్శలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి, నాయకత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ కవితపై మండిపడుతున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏకంగా కవితపై తీవ్ర వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ.. ఆమె వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కవిత చరిత్ర హీనురాలు, మంత్రి పదవులు అమ్ముకున్నారు, భూముల దోపిడీలు చేశారు, పార్టీలో కుట్రలు పన్నారు’ అంటూ మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాటలు దిగజారుడుతనానికి నిదర్శనం అని మరికొందరు నాయకులు అభివర్ణించారు. పదవులు ఇచ్చిన కన్నతల్లి వంటి పార్టీని, కన్న తండ్రిపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు.

అడబిడ్డ రాజకీయంపై ఉత్కంఠ

బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన తర్వాత కవిత తన రాజకీయ మార్గాన్ని స్పష్టం చేసుకుంటూ వస్తున్నారు. తన తండ్రి కేసీఆర్‌ను వ్యక్తిగతంగా మాత్రమే కలుస్తానని, రాజకీయంగా మాత్రం బీఆర్ఎస్‌తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా తాను పోరాడతానని ప్రకటించారు. అంతేకాకుండా.. ‘ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించడం తెలంగాణ రాజకీయాలపై ఆమె భవిష్యత్ ప్రభావంపై ఉత్కంఠను పెంచుతోంది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రశ్నించే శక్తిగా తెలంగాణ జాగృతిని బలోపేతం చేయాలని కవిత ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద, కవిత పదునైన విమర్శలు, వాటికి బీఆర్ఎస్ నాయకుల కౌంటర్లు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపాయని చెప్పవచ్చు.

ALSO READ: Global Summit 2025: సీఎం రేవంత్ రెడ్డి రియ‌ల్ లెజెండ్..క్రీడాకారుల ప్ర‌శంస‌లు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×