E-Paper
Advertisement

Brahma Muhurta: సూర్యోదయం కంటే ముందే మీ రోజూ మొదలైతే.. ఆరోగ్యం మీ గుప్పిట్లో ఉన్నట్లే!

Brahma Muhurta: సూర్యోదయం కంటే ముందే మీ రోజూ మొదలైతే.. ఆరోగ్యం మీ గుప్పిట్లో ఉన్నట్లే!
Advertisement

Brahma Muhurta Benefits: నేటి ఆధునిక యుగంలో మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. అర్ధరాత్రి వరకు మేల్కొనడం.. మరుసటి రోజు సూర్యుడు నడినెత్తికి వచ్చేవరకు నిద్రపోవడం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ, మన పెద్దలు చెప్పినట్టు వేకువజామున నిద్రలేవడం అనేది కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు.. అదొక అద్భుతమైన ఆరోగ్య రహస్యం. సూర్యోదయానికి ముందు ఉండే ఆ ప్రశాంతమైన సమయాన్ని‘బ్రహ్మ ముహూర్తం’ అంటారు. ఆ టైంలో నిద్రలేవడం వల్ల కలిగే మ్యాజికల్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వాతం సహజంగానే తగ్గుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. మీ శరీరం లోపలి నుండి శుభ్రం అవ్వడానికి ఇదే సరైన సమయం.

Advertisement

Also Read: గర్భిణీలు నువ్వులు తింటే అబార్షన్ అవుతుందా? ఈ ఒక్క విషయం తెలిస్తే మీ భయం మొత్తం పోతుంది!

రోజంతా ఉత్సాహం:

సూర్యోదయం కంటే ముందుగా లేవడం వల్ల హడావిడి లేకుండా అన్ని పనులను ప్లాన్ చేసుకోవచ్చు. ఉదయం పూట స్వచ్ఛమైన గాలి, తాజా సూర్యకిరణాలు శరీరానికి తగలడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఇది మనల్ని రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతుంది.

నిద్రలేమి సమస్య ఉండదు:

Advertisement

రాత్రి పడుకున్నప్పుడు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదని చాలామంది బాధపడుతుంటారు. అయితే అలాంటి వాళ్లు చేయాల్సింది ఒక్కటే.. ఉదయాన్నే నిద్రలేవడం. ఎందుకంటే.. వేకువజామునే దినచర్య మొదలైతే, రాత్రికి శరీరం సహజంగానే అలసిపోయి త్వరగా నిద్రలోకి జారుకుంటుంది. దీనివల్ల కళ్ల మంటలు తగ్గడమే కాకుండా.. కంటికి గాఢమైన నిద్ర దొరుకుతుంది.

ఒత్తిడి పరార్:

ఆఫీసుకో, కాలేజీకో వెళ్లేటప్పుడు ఉండే ఉరుకుల పరుగుల జీవితం మనల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. అదే ఉదయం గంట ముందు నిద్రలేస్తే.. కాలకృత్యాలు తీర్చుకుని, ప్రశాంతంగా స్నానం చేసి, కాసేపు భగవంతుడిని ప్రార్థించుకోవడానికి లేదా మెడిటేషన్ చేయడానికి సమయం దొరుకుతుంది. ఈ ప్రశాంతతే మిమ్మల్ని మానసిక ఒత్తిడి నుండి కాపాడుతుంది.

పూర్వం మునులు, మహర్షులు నదీ స్నానాలు చేసి ఆరోగ్యంగా ఉండేవారంటే కారణం వేకువజామున లేచే అలవాటే. అలారం మోగకముందే మేల్కొనే అలవాటు చేసుకుంటే.. సగం అనారోగ్య సమస్యలు  మన వద్దకు కూడా రావు.

Also Read: సైలెంట్ ఎనిమీ.. గోర్లు కొరకడం వల్ల శరీరంలోకి చేరే వేలకోట్ల బ్యాక్టీరియా గురించి మీకు తెలుసా?

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×