E-Paper
Advertisement

Chandrababu vs jagan : చంద్రబాబుకు క్లీన్‌చిట్.. మాజీ సీఎం జగన్‌కు భారీ షాకిచ్చిన ఏసీబీ కోర్టు!

Chandrababu vs jagan : చంద్రబాబుకు క్లీన్‌చిట్.. మాజీ సీఎం జగన్‌కు భారీ షాకిచ్చిన ఏసీబీ కోర్టు!
Advertisement

ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన మీద గత జగన్ సర్కారు హయాంలో నమోదు చేసిన అవినీతి అక్రమ కేసును తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనపై మోపిన కేసు అక్రమమని.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావాలనే ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అక్రమ కేసులు బనాయించారని తాజా కోర్టు తీర్పుతో ఇది నిరూపితమైందని తెలుగు దేశం పార్టీ శ్రేణులు చెబుతున్నారు.అన్యాయంగా చంద్రబాబు మీద కేసులు బనాయించి ఆయన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, మానసికంగా వేధించారని ఫైర్ అవుతున్నారు.

అవినీతి ఆరోపణల పేరిట అక్రమ కేసులు..

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రీవెంజ్ పాలిటిక్స్ చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించిన జగన్.. తీరా అధికారంలోకి వచ్చాక టీఫైబర్ స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, అమరావతి ల్యాండ్ స్కామ్, కంపెనీలకు తక్కువ ధరకే భూములు కట్టబెట్టారని చంద్రబాబు, మరికొందరు నేతల మీద అక్రమంగా కేసులు బనాయించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఆయన్ను అరెస్టు చేయించి 53 రోజుల పాలు జైలులోనూ ఉంచారు.

రూ.114 కోట్ల స్కామ్ ప్రీ ప్లానేనా?

Advertisement

వైసీపీ పవర్‌లోకి వచ్చాక ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు పెట్టించింది. 2014-19 నడుమ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో నిబంధనలను ఉల్లంఘించి వివిధ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని, దానివల్ల కార్పొరేషన్‌కు రూ.114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. నాటి ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేమూరి హరికృష్ణ, ఎండీ కె.సాంబశివరావు, టెర్రాసాఫ్ట్‌ డైరెక్టర్‌ తుమ్మల గోపాలకృష్ణ, చంద్రబాబు (ఏ-25), ముంబై, ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, వాటి ఉన్నతాధికారులను నిందితుల జాబితాలో చేర్చారు. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో అభియోగాలు ప్రూవ్ చేయలేదని విజయవాడ ఏసీబీ కోర్టు ఆ కేసును కొట్టివేసింది.

 

Advertisement

చంద్రబాబుతో పాటు ఈ కేసులో అభియోగం ఎదుర్కొన్న అందిరికీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని రుజువైంది.కావాలనే జగన్ తనకు అధికారం ఉందని వ్యవస్థలను తప్పు దారి పట్టించారని, ముందస్తు ప్లాన్ ప్రకారమే అన్యాయంగా కేసుల్లో ఇరికించారని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఫైబర్ నెట్ కేసులో ఎటువంటి అక్రమాలు జరగలేదని కోర్టు స్పష్టం చేయడంతో జగన్ నిజస్వరూపం మరోసారి ఏపీ ప్రజలకు అర్థంఅయ్యిందని, చంద్రబాబు నిజాయితీ ఏమిటో కూడా జనాలకు అర్థం అయ్యిందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కూటమి సర్కారు, టీడీపీపై జగన్ ఇక మీదట చేసే ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని.. వారంతా అభివృద్దికి మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు. భవిష్యత్‌లోనూ జగన్, వైసీపీ శ్రేణులు చెప్పే అబద్దాలను, అవినీతి ఆరోపణలను ప్రజలే తిప్పికొడతారని వారు భరోసాతో ఉన్నారు.

 

 

 

 

 

 

 

 

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×