Bitter Gourd Juice: రోజువారీ ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యంపై ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో మనకు అర్థం అవుతుంది. అలాంటి చిన్న మార్పుల్లో ఒకటి కాకరకాయ జ్యూస్. సాధారణంగా కాకరకాయ అంటే చాలా మందికి చేదుగా ఉంటుందని దూరంగా పెట్టేస్తారు. కానీ అదే చేదు రుచి మన ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.
అజీర్ణం, గ్యాస్ మంచి టానిక్
ప్రతీ రోజు ఉదయాన్నే పరగడుపున సుమారు 30 ఎంఎల్ మోతాదులో కాకరకాయ జ్యూస్ తాగితే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. మొదటిగా, మనం తరచుగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి జీర్ణ సమస్యలు. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటివి సాదారణంగానే చాలా మందిని ఇబ్బంది పెడతాయి. కాకరకాయ జ్యూస్ ఈ సమస్యలను తగ్గించే శక్తి కలిగిన సహజ మందు. ఇది పేగుల కదలికలను సరిచేసి, ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది.
కాకరకాయలో విటమిన్ – ఎ
దీనిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఎ అంటే కేవలం చర్మానికి, జుట్టుకే కాదు, కంటి చూపుకు కూడా అత్యవసరం. క్రమం తప్పకుండా కాకరకాయ జ్యూస్ తాగడం వలన కంటి చూపు మెరుగుపడటమే కాకుండా, కంటి సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేసే కాకరకాయ
మన శరీరానికి రోగాల్ని ఎదుర్కొనే శక్తి అంటే రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యమైనది. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (ప్రతిజీవక పదార్థాలు) మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరిగి, మనం తరచుగా జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్లకు లోనవకుండా కారకాయ కాపాడుతుంది.
Also Read: Jio Cricket Plan: జియో స్పెషల్ ప్లాన్‌కి టైమ్ లిమిట్.. మిస్ అయితే మళ్లీ దొరకదు
చక్కెర స్థాయి తగ్గిస్తుంది
నేటి కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలు షుగర్, కొలెస్ట్రాల్. కాకరకాయలో ఉండే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. అందుకే డయాబెటిస్ ఉన్న వారికి ఇది సహజమైన మందులాంటిది. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
క్యాన్సర్ నిరోధక శక్తి
ఇక మరో ముఖ్యమైన అంశం క్యాన్సర్ నిరోధక శక్తి. కాకరకాయలో ఉండే పోషకాలు శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
మొటిమలు, మచ్చలకు సరైన జ్యూస్
ఇంకా ఒక ప్రత్యేకమైన లాభం ఏమిటంటే, కాకరకాయ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వలన మన శరీరంలో రక్తం పరిశుభ్రంగా ఉంటుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. అంటే అందం, ఆరోగ్యం రెండింటికీ ఇది ఒక సహజ మిత్రుడు.
జ్యూస్ ఎంత మోతాదులో తీసుకోవాలి
అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, రోజుకు 30 ఎంఎల్ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరానికి అసౌకర్యాలు కలగవచ్చు. కాబట్టి పరిమితిని పాటించడం తప్పనిసరి. ఈ అలవాటు, దీర్ఘకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఆయుధంగా మారుతుంది.