Dheeraj Mogilineni: ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే సినిమాని నిర్మించడం ఎంత ముఖ్యమో ఆ సినిమాని అదే విధంగా ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తున్నాము అంటే సినిమా చూడటానికి ఎవరు రారు. అందుకే పెద్ద ఎత్తున చిత్ర బృందం సినిమాని విభిన్న రీతులలో ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులలోకి తీసుకు వెళ్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదల అవుతుంది అంటే తప్పనిసరిగా ప్రీ రిలీజ్ వేడుకలను (Pre Release Event) ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా ప్రీ రిలీజ్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయడమే కాకుండా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలను రాజకీయ నాయకులను కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూ ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుక గురించి తాజాగా నిర్మాత ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni)మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ధీరజ్ మాట్లాడుతూ సినిమాలకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నా దృష్టిలో పరమ వేస్ట్ అని తెలిపారు. అయితే కొన్ని సినిమాలకు ఈ వేడుక చాలా అవసరం కానీ అన్ని సినిమాలకు కాదని ఈయన వెల్లడించారు. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోని సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయని ధీరజ్ గుర్తు చేశారు.
ఇలా ఒక సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తేనే మంచి బజ్ వస్తుంది అనుకోవడం పొరపాటని, ఇక ఈ వేడుక నిర్వహించాలి అంటే సినీ నిర్మాతలకు ఉండే ప్రధాన సమస్య గెస్టులుగా ఇతర హీరోలను ఆహ్వానించడమే అని తెలిపారు. ఆ కార్యక్రమానికి స్టార్ హీరో గెస్ట్ గా వస్తే బాగుంటుందని ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ ఫోన్లు చేస్తుంటాము అయితే కొన్ని కారణాలవల్ల వాళ్ళు రాలేకపోతూ ఉంటారు. అప్పుడు కూడా పెద్ద సమస్యగా మారుతుందని ధీరజ్ తెలిపారు. ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించకపోతే నిర్మాత డబ్బు ఖర్చు పెట్టలేక ఇలా ఈవెంట్ క్యాన్సిల్ చేశారని ఆరోపణలు కూడా వస్తాయని ఈయన వెల్లడించారు.
రష్మిక హీరోయిన్ గా ది గర్ల్ ఫ్రెండ్..
ఇలా ఎప్పుడు పాత పద్ధతిలోనే కాకుండా సినిమాని కొత్తగా ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాలని ఈయన వెల్లడించారు. కొత్తగా ట్రై చేస్తేనే ప్రేక్షకులకు సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా సినిమాపై మంచి బజ్ ఏర్పడుతుందని ధీరజ్ తెలిపారు. ఇలా ప్రీ రిలీజ్ వేడుకల గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ధీరజ్ నిర్మాణంలో రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా రష్మికకు జోడిగా దీక్షిత్ శెట్టి నటించారు. లవ్ రొమాంటిక్ సినిమాగా ఈ సినిమా నవంబర్ 7వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే నిర్మాత ధీరజ్ ప్రీ రిలీజ్ వేడుక గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: Shiva Movie: శివ సినిమాలో మోహన్ బాబు.. రిజెక్ట్ చేసిన వర్మ.. ఏమైందంటే?