చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Vivo Y19s 5G పేరుతో దేశీ మార్కెట్ లో లాంచ్ చేసింది. 6,000mAh బ్యాటరీ, 5G కనెక్టివిటీ సపోర్ట్ తో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వివో ఇండియా వెబ్ సైట్ లోని లిస్టింగ్ ఫోన్ దేశంలో రెండు రంగులలో, మూడు స్టోరేజ్ వేరియంట్లలో అమ్మనున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి స్పెసిఫికేషన్లు పూర్తిగా వెల్లడయ్యాయి. ఇది 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వెనుక వైపు డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది.
భారత్ లో Vivo Y19s 5G ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ హ్యాండ్ సెట్ 4GB+64GB, 4GB+128GB, 6GB+128GB కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. Vivo Y19s 5Gని మెజెస్టిక్ గ్రీన్, టైటానియం సిల్వర్ రంగులలో అందుబాటులో ఉంచింది. 4GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన Vivo Y19s 5G బేస్ వేరియంట్ ధర రూ. 10,999గా ఉంటుందని టెక్ సైట్లు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో 4GB RAM + 128GB స్టోరేజ్, 6GB RAM + 128GB కలిగిన హై ఎండ్ ఆప్షన్‌ల ధర రూ. 11,999, రూ.13,499గా ఉంటుందని తెలుస్తోంది.
Vivo Y19s 5G డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్. ఇది Android 15 ఆధారిత FuntouchOS 15పై రన్ అవుతుంది. ఇది 720×1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 70 శాతం NTSC కలర్ గామట్, 260ppi పిక్సెల్ డెన్సిటీ, 700 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ కలిగిన 6.74-అంగుళాల LCD స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ బడ్జెట్ హ్యాండ్ సెట్ ఆక్టా కోర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ ఉంది. ఇది రెండు పెర్ఫార్మెన్స్ కోర్లు, ఆరు ఎఫిషియెన్సీ కోర్లను కలిగి ఉంది. ఇది 2.4GHz పీక్ క్లాక్ స్పీడ్ ను అందిస్తుంది. Vivo Y19s 5G 6GB వరకు LPDDR4X RAM, 128GB వరకు eMMC5.1 ఆన్ బోర్డ్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు.
ఇక ఆప్టిక్స్ విషయానికొస్తే.. Vivo Y19s 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. దీనికి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (f/2.2), 0.8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా (f/3.0) ఉన్నాయి. ముందు భాగంలో, ఇది 5-మెగాపిక్సెల్ (f/2.2) సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక కెమెరా నైట్, పోర్ట్రెయిట్, లైవ్ ఫోటో, స్లో మో, టైమ్ లాప్స్ మోడ్స్ తో సహా పలు ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. ఆన్ బోర్డ్ సెన్సార్ల కు సంబంధించి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ కంపాస్ ఉన్నాయి. కొత్త Vivo Y19s 5G కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, USB టైప్ C పోర్ట్, GPS, BeiDou, GLONASS, గెలీలియో, QZSS కు సపోర్టు ఇస్తుంది. ఇది 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 డస్ట్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది.
Read Also: 7,000mAh బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ కెమెరా, కళ్లు చెదిరే రియల్ మీ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది!