Jio Cricket Plan: జియో వినియోగదారులకు ఒక ప్రత్యేక ఆఫర్ రూపంలో అందించిన సౌకర్యం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. రూ.349 రీచార్జ్ చేస్తే 28 రోజులపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా లభించడం మాత్రమే కాదు, అదనంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా పూర్తిగా ఉచితంగా అందుతుంది.
సౌకర్యాలన్నీ కేవలం 349 రూపాయలకే
ఒకే రీచార్జ్‌తో డేటా కూడా వస్తోంది, వినోదం కూడా వస్తోంది. సాధారణంగా వేర్వేరుగా ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన సౌకర్యాలు ఇప్పుడు కేవలం 349 రూపాయలకే లభిస్తున్నాయి. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, రియాలిటీ షోలు ఈ రకమైన వినోదం మొత్తం ఎప్పుడైనా ఎక్కడైనా మీ మొబైల్ ఫోన్‌లోనే ఆస్వాదించే అవకాశం దొరుకుతోంది.
ఈ ప్లాన్‌ను తీసుకోవడం పూర్తి వినోదమే
ఇప్పటికే ఈ ప్లాన్‌ను వాడుకుంటున్న వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రత్యేకంగా క్రికెట్ అభిమానుల కోసం ఈ ఆఫర్ ఒక బంగారు అవకాశంగా మారింది. లైవ్ మ్యాచ్‌లు చూడటానికి వేరుగా సబ్‌స్ క్రిప్షన్ కొనాల్సిన అవసరం లేకుండా ఒకే రీచార్జ్‌తో మొత్తం సౌకర్యం లభించడం మంచి అవకాశం అనే చెప్పొచ్చు. అదేవిధంగా వెబ్ సిరీస్‌లను ఇష్టపడేవారు, కుటుంబంతో కలిసి సినిమాలు చూడాలనుకునేవారు కూడా ఈ ప్లాన్‌ను తీసుకోవడం వల్ల పూర్తి వినోదాన్ని ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా పొందుతున్నారు.
Also Read: Airtel Xstream Fiber:1జిబిపిఎస్ వేగంతో వస్తున్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్.. ప్రత్యేకతలు ఇవే
త్వరలో ముగియనున్న ఆఫర్
కానీ ఈ ఆఫర్ ఎప్పటికీ ఉండదని జియో కస్టమర్లు గమనించాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే వివరణ ఇస్తూ జియో స్పష్టంగా ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 30, 2025 వరకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పొర్కొంది. ఆ తర్వాత ఈ ప్లాన్ పూర్తిగా ముగిసిపోతుంది. అంటే ఆలస్యం చేసిన వారు ఈ అవకాశాన్ని కోల్పోతారు. చాలా తక్కువ సమయంలో, చాలా తక్కువ మొత్తంలో ఇంత పెద్ద సౌకర్యం మళ్లీ వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. అందుకే జియో వినియోగదారులు ఇప్పుడే ఈ రీచార్జ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
28 రోజులు- ప్రతిరోజూ 2జీబీ డేటా
ఒకసారి ఆలోచిస్తే 349 రూపాయలతో 28 రోజులపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తోంది. అదే సమయంలో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా వస్తోంది. ఈ రెండు వేర్వేరుగా కొనాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు కేవలం 349 రూపాయలతోనే రెండింటినీ ఒకేసారి పొందడం ఒక ప్రత్యేక అవకాశంగా నిలుస్తోంది.
వెంటనే రీచార్జ్ చేసుకోండి
వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి సమయం చాలా తక్కువ. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్ పూర్తిగా ముగిసిపోతుంది. కాబట్టి వెంటనే రీచార్జ్ చేసుకుని వచ్చే 28 రోజులు డేటాతో పాటు ఎప్పుడూ ఎంటర్టైన్‌మెంట్ మిస్ కాకుండా ఆస్వాదించండి.