Kerala State Film Awards 2025: 55వ చలనచిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏడాది మలయాళంలో అత్యుత్తుమ నటన కనబరిచిన నటీనటులు రాష్ట్ర చలన చిత్ర అవార్డులతో ప్రభుత్వం సత్కరిస్తుంది. అలాగే ఈ ఏడాదిగానూ 2024లో భారీ విజయం సాధించిన సినిమాలు, ఉత్తమ నటన కనబర్చిన నటీనటలును ఎంపిక చేసి ప్రకటించింది. ఈ ఏడాది రాష్ట్ర పురస్కారాల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆయన నటించిన బ్రహ్మయుగం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఆయనకు అవార్డు వరిచింది. దీంతో ఆయన ఏడుసార్లు రాష్ట్ర అవార్డు అందున్నారు. ఫెమినిచి ఫాతిమా చిత్రానికి షమ్లా హంజా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.
ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ సినిమా నిలిచింది. చిదంబరం ఎస్ పొడువాల్‌కు ఉత్తమ దర్శకుడు, సౌబిన్ షాహిర్‌కు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (పురుషుడు), అలాగే ఉత్తమ సినిమాటోగ్రఫీ మరియు ఉత్తమ సాహిత్యం వంటి వివిధ విభాగాల్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. మత్స్య, సంస్కృతి మరియు యువజన సంక్షేమ మంత్రి సాజి చెరియన్ అధ్వర్యంలో త్వరలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ సినిమా ఎంపిక కోసం ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల జ్యూరీ నియమించారు. వీరు మొత్తం 128 చిత్రాల నుంచి అందులో వివిధ విభాలను నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉత్తమ చిత్రాలు, నటీనటులను ఎంపిక చేశారు. మొత్తం 128 చిత్రాల నుంచి 26 సినిమాలను షార్ట్‌లిస్ట్ చేసి అవార్డులు ప్రకటించారు.
ఉత్తమ చిత్రం: మంజుమ్మల్ బాయ్స్
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ప్రేమలు
ఉత్తమ వీఎఫ్ఎక్స్ (VFX): ఏఆర్ఎమ్ (ARM)
ఉత్తమ నటుడు– మమ్ముట్టి (బ్రహ్మయుగం)
ఉత్తమ నటి – షమ్లా హంజా (మినిచి ఫాతిమా)
ఉత్తమ దర్శకుడు – చిదంబరం ఎస్ పొదువల్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ సంగీత దర్శకుడు – బౌగైన్విల్లా సినిమాకు దర్శకుడి వరించింది.