Almond Milk: బాదం పాలు.. బాదం గింజలను నీటిలో నానబెట్టి, రుబ్బి, వడకట్టడం ద్వారా తయారు చేస్తారు. ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా దీనిని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉపయోగిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు కూడా బాదం పాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒక నెల పాటు లేదా రోజువారీ ఆహారంలో బాదం పాలను చేర్చుకోవడం వల్ల కలిగే 7 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పాలు తాగితే.. ఎన్ని ప్రయోజనాలు:
1. తక్కువ కేలరీలు, బరువు తగ్గడానికి సహాయం:
తీయని, బాదం పాలలో ఆవు పాల కంటే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక కప్పు (240 మి.లీ) బాదం పాలలో కేవలం 30-40 కేలరీలు మాత్రమే ఉంటాయి. అధిక కేలరీల పాలకు బదులుగా దీనిని తీసుకోవడం వల్ల రోజువారీ కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గడానికి లేదా బరువు తగ్గించడానికి సహాయ పడుతుంది.
2. ఎముకల పటిష్టత:
సహజంగానే బాదం పాలల్లో కాల్షియంఉండకపోయినా.. వాణిజ్యపరంగా తయారుచేసే బాదం పాలను సాధారణంగా కాల్షియం, విటమిన్ డితో పటిష్టం చేస్తారు. కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని, పటిష్టతను కాపాడుతుంది. విటమిన్ డి శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3. గుండె ఆరోగ్యం మెరుగుదల:
బాదంలో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. బాదం పాలలో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు అస్సలు ఉండవు. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి తోడ్పడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
4. రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ:
బాదం పాలలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ ) చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర నియంత్రణ అవసరమైన వారికి ఇది ఆవు పాల కంటే మంచి ప్రత్యామ్నాయం.
Also Read: సాధారణ తలనొప్పి అనుకోవద్దు ! నిర్లక్ష్యంతో ప్రాణాలకే ప్రమాదం
5. చర్మ , జుట్టు సంరక్షణ :
బాదం పాలలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది. విటమిన్ ఇ చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. అలాగే.. ఇది జుట్టుకు కూడా పోషణ అందిస్తుంది.
6. విటమిన్ డి, యాంటీఆక్సిడెంట్లు:
బాదం పాలలో విటమిన్ డి తో పాటు, శరీరంలో మంటను తగ్గించే ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయ పడుతుంది.