చైనీ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ.. జిటి 8 ప్రో ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 లిమిటెడ్ ఎడిషన్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ నెల చివర్లో చైనాలో ఈ క్రేజీ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ హ్యాండ్ సెట్ రియల్‌మీ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేక ఎడిషన్ గా వస్తుంది. ఆస్టన్ మార్టిన్ సిగ్నేచర్ గ్రీన్ ఫినిషింగ్ ను కలిగి ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ మధ్యలో బ్రాండ్ ఐకానిక్ టూ వింగ్ లోగోతోను కలిగి ఉంటుంది. డిజైన్ ప్రీమియం మోటార్ స్పోర్ట్ మేకోవర్ తో వస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ స్టాండర్డ్ రియల్‌మీ జిటి 8 ప్రోతో మాదిరిగా స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
రియల్‌మే జిటి 8 ప్రో ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 లిమిటెడ్ ఎడిషన్ నవంబర్ 10న చైనాలో లాంచ్ కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ లాంచ్ ఈవెంట్ స్థానిక సమయం ప్రకారం ఉదయం 10:00 గంటలకు ( భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు) ప్రారంభమవుతుంది. ఈ వేరియంట్ భారత్ సహా ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉంటుందా? లేదా? అనే విషయంపై కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. స్టాండర్డ్ రియల్‌మీ GT 8 ప్రో నవంబర్ 20న భారత్ లో లాంచ్ కానుంది.
రియల్ మీ తన చైనా వెబ్ సైట్ లోని ప్రత్యేక ల్యాండింగ్ పేజీ ద్వారా GT 8 ప్రో ఆస్టన్ మార్టిన్ F1 లిమిటెడ్ ఎడిషన్ ను టీజర్ ను విడుదల చేసింది. ఈ వేరియంట్ గ్రీన్ కలర్ ఫినిషింగ్ తో పాటు, సిల్వర్ కలర్ లో ఫార్ములా వన్ టీమ్ బ్రాండింగ్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ రియల్ మీ GT 7 డ్రీమ్ ఎడిషన్ ను పోలి ఉంది. రియల్ మీ జిటి 8 ప్రో ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 లిమిటెడ్ ఎడిషన్ హార్డ్ వేర్.. స్టాండర్డ్ జిటి 8 ప్రో మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. భారత్ లో రియల్ మీ జిటి 8 ప్రో లాంచ్‌ను కంపెనీ ఇప్పటికే కన్ఫార్మ్ చేసింది. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి లాంచ్ అయినందున, లిమిటెడ్ ఎడిషన్ మోడల్ స్టాండర్డ్ రియల్‌మే జిటి 8 ప్రోతో పాటు ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంది.
రియల్‌మీ జిటి 8 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్ తో 6.79-అంగుళాల QHD+ (1,440×3,136 పిక్సెల్స్) AMOLED డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5పై రన్ అవుతుంది. 16GB వరకు RAM, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రియల్‌మీ జిటి 8 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ రికో GR యాంటీ గ్లేర్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69+IP68+IP66 రేటింగ్ ను కలిగి ఉంది.
Read Also: లీక్ అయిన రెనో 15 సిరీస్ రిలీజ్ డేట్, ట్రిపుల్ సర్‌ప్రైజ్ తో ఒప్పో రెడీ!