Pakistan : పాకిస్తాన్ జట్టు ఏ క్రీడలోనైనా ఎలా వ్యవహరిస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఇటీవల ఆసియాకప్ 2025లో టీమిండియా పై ఓటమి చెందిన పాకిస్తాన్ జట్టు.. మ్యాచ్ రిఫరీ పై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. దీంతో మ్యాచ్ రిఫరీని పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లకు రిచర్డ్ సన్ వ్యవహరిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ జట్టు పేరుతో జపాన్ లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్ పౌరులను ఆ దేశం ఎయిర్ పోర్టు నుంచే డిపోర్ట్ చేసింది. దేశంలో జరుగుతున్న ఫుట్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి పాక్ నుంచి వచ్చినట్టుగా చెప్పుకుంటూ ఇటీవలే 22 మంది వ్యక్తులు జపాన్ కి వెళ్లారు.
Also Read : Pakistan : పాక్ కి అవమానం.. తోక ముడిచి, మాట తప్పి.. UAE తో మ్యాచ్ కి ఓకే చెప్పారుగా..!
పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నికిలీ నో అబ్జెక్ష్ సర్టిఫికెట్లు వారి వద్ద ఉండటంతో ఫుట్ బాల్ నిర్వాహకులకు కూడా వారిపై ఎలాంటి అనుమానం రాలేదు. జపాన్ లోని విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం విచారణ సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు వారిపై అనుమానం రావడంతో దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో వారిని నకిలీ జట్టుగా గుర్తించిన జపాన్ అధికారులు విమానశ్రయం నుంచే వెనక్కి పంపారు. అయితే వీరు పాకిస్తాన్ విమానాశ్రయ అధికారుల నుంచి ఎలా తప్పించుకోగలిగారనే విషయం పై ఇంకా ఎలాంటి స్పష్టత రావాల్సి ఉందన్నారు. పాకిస్తాన్ లోని సియాల్ కోట్ కు చెందిన మాలిక్ వకాస్ అనే వ్యక్తి వీరిని అక్రమంగా జపాన్ కి పంపించడానికి ఈ పథకం రచించినట్టు పాక్ అధికారులు వెల్లడించారు. గుజ్రాన్ వాలాలోని ఎఫ్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసారు.
Also Read : Team India : ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా అరుదైన రికార్డు… ఇప్పటివరకు ఏ జట్టు సాధించని చరిత్ర
ఫుట్ బాల్ ప్లేయర్సేనా..టెర్రరిస్టు లా..?
వారిని అక్రమంగా పంపిచండం కోసం నిందితుడు గోల్డెన్ ఫుట్ బాల్ ట్రయల్ అనే నకిలీ ఫుట్ బాల్ క్లబ్ ప్రారంభించాడని అధికారులు తెలిపారు. జపాన్ కి తీసుకెళ్తామని ఆశచూపించి.. పాకిస్తాన్ లోని 22 మంది వ్యక్తుల వద్ద నుంచి వకాస్ రూ.కోటికి పైగా పాకిస్తాన్ రూపాయలను వసూలు చేసినట్టు సమాచారం. ఈ విధంగా వకాస్ అక్రమ రవాణాకు ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదని.. 2024లో కూడా ఇలాగే నకిలీ పత్రాలతో జపాన్ కి 17 మంది వ్యక్తులను అక్రమంగా పంపించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉగ్రవాదులు విచ్చలవిడిగా పలు దేశాలపై దాడులు జరుపుతున్న వేళ.. ఇలా నకిలీ ఆటగాళ్లను పంపించడంతో వాళ్లు.. ఆటగాళ్లా..? ఉగ్రవాదులా..? అంటూ కొందరూ కామెంట్స్ చేయడం గమనార్హం.