Beers: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే బేవరేజెస్‌లో బీర్ ప్రథమ స్థానంలో ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువ మందికి నచ్చే ఆల్క్‌హాల్ ఏదైనా ఉందంటే.. అది బీర్ మాత్రమే. పార్టీలైనా, పండగలైనా, ఫంక్షన్లైనా, బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా.. సందర్భం ఏదైనా సరే బీరు పొంగి పొర్లాల్సిందే. దీనికి తోడు మిగతా ఆల్క్‌హాల్ బ్రాండ్లతో పోలిస్తే.. బీరు ధర కాస్త తక్కువగానే ఉంటుంది. అయితే, చాలామంది బీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే కదా లెక్కకు మించి లాగించేస్తున్నారు. అయితే, వారంలో ఎన్ని బీర్లు తాగొచ్చు? లెక్కు మించి తాగితే ఏమౌతుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యువతకు బాగా ఇష్టమైన ఆల్కహాల్ డ్రింక్.. బీర్. ఈ బీర్లు ముఖ్యంగా వేసవికాలంలోనే అత్యధికంగా అమ్ముడుపోతుంటాయి. వీటిని గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలు పులియబెట్టి తయారు చేస్తుంటారు. మన దేశంలో ఎన్నో రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో 4 శాతం నుంచి 7 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. అయితే, బీర్ అనేది లిమిట్‌గా తాగితే.. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అలా అని, అతిగా తాగితే మాత్రం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, బీర్ వల్ల కలిగే లాభాలతో పాటు నష్టాలు కూడా తెలుసుకోవడం ముఖ్యం.
చాలామంది బాధొచ్చినా, సంతోషం వచ్చినా బీర్లను ఉద్యమంలా తాగేస్తుంటారు. కొంతమంది ఒకసారి సిట్టింగ్‌లో కూర్చుంటే కేసు బీర్లు లేపేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) రిపోర్ట్ ప్రకారం.. వారంలో ఆడ, మగ ఎవరైనా సరే 14 యూనిట్లకు మించి బీర్లు తాగకూడదట. ఇక్కడ యూనిట్ అంటే.. 10 మిల్లీలీటర్ల ప్యూర్ ఆల్కహాల్ అని అర్థం.
సాధరణంగా వారంలో ఆరు బీర్ బాటిళ్లు తాగినట్లయితే.. 14 యూనిట్ల లిమిట్‌లో ఉంటారు. అంతకు మించి తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే రెగ్యులర్‌గా తాగేవారు ప్రతి వారంలో రెండు రోజులు బ్రేక్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆల్కహాల్ ఎఫెక్ట్ నుంచి కోలుకోడానికి బాడీకి తగినంత సమయం పడుతుంది. బీర్‌లో ఉండే HDL(మంచి కొలెస్ట్రాల్) గుండెకు మంచిది. ఇది అధికంగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తక్కువ. ఈ బీర్‌లో కొద్ద మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో ఎముకలు బలపడతాయి. ఫలితంగా, ఆస్టియోపోరోసిస్ వ్యాధి ముప్పు తగ్గుతుంది.
వారంలో లెక్కకు మించి బీర్లు తాగడం వల్ల మత్తు కారణంగా నిద్ర పడుతుందేమో కానీ.. మత్తు దిగిన తర్వాత నిద్ర రాదు. దీంతో స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. ఫలితంగా శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు. ఇక్కడ బీర్ కూడా మద్యమే అనే విషయాన్ని మర్చిపోవద్దు, లైట్ లేదా మోడరేట్‌గా ఆల్కహాల్ తీసుకున్నా.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. అందుకే, ఆల్కహాల్ పూర్తిగా మానేయడం ఉత్తమం. మద్యానికి అలవాటైన వారు లిమిట్స్‌కి మించి తాగితే ప్రమాదంలో పడ్డట్టే.