E-Paper
Advertisement

కింద నాయకులు.. వేదికపై కార్యకర్తలు.. చరిత్ర తిరగరాసిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు!

కింద నాయకులు.. వేదికపై కార్యకర్తలు.. చరిత్ర తిరగరాసిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు!
Advertisement

TDP 44th Celebrations: తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తిచేసుకుంది. అయితే ఈసారి వేడుక కేవలం పండుగలా మాత్రమే కాదు.. ఒక సరికొత్త చరిత్రకు వేదికైంది. ‘కార్యకర్తే పార్టీకి ప్రాణం’ అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా.. సరికొత్త హంగులతో, సరికొత్త ఒరవడితో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అంబరాన్నంటింది!

ప్రోటోకాల్ గోడలు బద్దలుకొట్టని టీడీపీ

రాజకీయాలంటేనే పదవులు.. పదవులంటేనే ప్రోటోకాల్. కానీ తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకల్లో ఆ ప్రోటోకాల్‌ గోడలు బద్దలయ్యాయి. ఎప్పుడూ వేదికల మీద నాయకులు, కింద కార్యకర్తలు ఉండటం చూశాం. కానీ ఈ సారి సీన్ రివర్స్ అయింది. అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పార్టీ కోసం చెమటోడ్చిన సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేస్తూ.. వారిని సభా వేదికపై సగర్వంగా కూర్చోబెట్టింది అధిష్టానం. సీనియర్ నాయకులు కింద సభికుల్లో కూర్చుని కార్యకర్తలకు గౌరవాన్ని అందించడం ఈ సభకే హైలెట్‌గా నిలిచింది. అలా మొత్తం 19 మంది సామాన్య సైనికులు.. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో కలిసి వేదికను పంచుకోవడం ఒక సరికొత్త చరిత్రకు నాంది పలికింది.

కష్ట పడి పనిచేసిన వారికే ఆ గుర్తింపు

Advertisement

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారు.. కష్టకాలంలో జెండా మోసిన వారు.. గత ప్రభుత్వ వేధింపులను తట్టుకుని నిలబడిన ధీరులు.. ఇలా ఎంపిక చేసిన 19 మంది సామాన్య కార్యకర్తలను వేదికపైకి ఆహ్వానించింది టీడీపీ నాయకత్వం. తాము పడ్డ కష్టాలను, పార్టీపై తమకున్న మక్కువను వారు భావోద్వేగంతో వివరిస్తుంటే.. సభ ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. “కార్యకర్తే అధినేత” అనే నినాదాన్ని నూటికి నూరు పాళ్లు నిజం చేసిన పార్టీ టీడీపీనే అంటూ వారు గర్వంగా చాటిచెప్పారు. ఈ సభకు మరో ప్రత్యేక ఆకర్షణ.. యువ నాయకత్వం. సభ నిర్వహణ బాధ్యతలను యువ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మకు అప్పగించడం ద్వారా పార్టీ భవిష్యత్తు వారసులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్టమైంది. చకచకా సాగిన కార్యక్రమం, యువత ఉత్సాహం వెరసి సభకు ఒక ఫ్రెష్ లుక్‌ని తీసుకొచ్చింది.

కార్యకర్తల కష్టానికి దక్కిన గౌరవం

ఎన్నో ఇబ్బందులు పడి, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఆ కార్యకర్తలు.. సాక్షాత్తూ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కనే ఆసీనులవ్వడం.. తెలుగుదేశం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అన్నారు నారా లోకేష్. కార్యకర్తల కష్టానికి దక్కిన అసలైన గౌరవం ఇది అని చెప్పారు. సీనియర్ల అనుభవం.. యువత ఆలోచన.. కార్యకర్తల అంకితభావం.. ఈ మూడింటి కలయికతో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఒక కొత్త ఆశను, నూతనోత్తేజాన్ని నింపాయి. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే పార్టీగా టీడీపీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది అంటున్నారు. రాబోయే కాలంలో ఈ జోష్ పార్టీని మరిన్ని విజయాల వైపు నడిపించబోతోంది అని కేడర్ ధీమా వ్యక్తం చేస్తున్నది.

Advertisement

Also Read: గన్ సైగలు.. నోటి దురద.. పాడి కౌశిక్ రెడ్డి పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

Story by: Apparao, Big Tv

Related News

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

Big Stories

Advertisement
×