E-Paper
Advertisement

వేసవిలో మజ్జిగ తాగుతున్నారా? వీళ్లు దూరంగా ఉంటేనే బెటర్

వేసవిలో మజ్జిగ తాగుతున్నారా? వీళ్లు దూరంగా ఉంటేనే బెటర్
Advertisement

Buttermilk: వేసవికాలం అంటే తరచూ చల్లని డ్రింక్స్ తాగాలని చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో మజ్జిగ తాగడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. మజ్జిగ వల్ల శరీరాన్ని చల్లబరచడం, జీర్ణ క్రియ మెరుగు పరచడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ప్రతి ఒక్కరికీ ఇది సరైన డ్రింక్ కాదు. కొందరికి ఇది ఆరోగ్య సమస్యలను పెంచే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మజ్జిగ తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మజ్జిగ ఎవరు తాగకూడదు:

Advertisement

1. లాక్టోజ్ అలర్జీ ఉన్నవారు:
లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఉన్న వారు పాలు లేదా పాల ఉత్పత్తులను జీర్ణించుకోలేరు. మజ్జిగలో లాక్టోజ్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ.. కొందరికి ఇది కడుపు ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్ సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు మజ్జిగను పరిమితంగా లేదా పూర్తిగా మానేయడం మంచిది.

2. జలుబు,దగ్గు తరచుగా వచ్చే వారు:
మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది. అందుకే ఇప్పటికే జలుబు, దగ్గు లేదా గొంతు సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది మరింత ఇబ్బందులు కలిగించవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో మజ్జిగ తాగడం వల్ల శ్లేష్మం పెరిగే అవకాశం ఉంది.

Advertisement

3. కిడ్నీ సమస్యలు ఉన్నవారు:
కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్న వారు సోడియం, పొటాషియం వంటి ఖనిజాలపై జాగ్రత్తగా ఉండాలి. మజ్జిగలో ఇవి కొంతమేర ఉంటాయి. అందుకే మజ్జిగ అధికంగా తీసుకుంటే కిడ్నీ పని తీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే మజ్జిగను తీసుకోవాలి.

4. అలర్జీ ఉన్నవారు:
కొంత మందికి పాల ఉత్పత్తులపై అలర్జీ ఉంటుంది. అలాంటి వారు మజ్జిగ తాగితే చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది తీవ్రమైన పరిస్థితులకు దారి తీయవచ్చు కాబట్టి పూర్తిగా దూరంగా ఉండాలి.

Also Read: కిచెన్ స్పాంజిలో కోట్ల బ్యాక్టీరియా.. మార్చడానికి సరైన సమయం ఇదే!

5. అతిగా బరువు తగ్గాలనుకునే వారు:
మజ్జిగ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ.. కొన్ని రకాల మజ్జిగల్లో ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నీటి నిల్వ పెంచి బరువు తగ్గడంలో ఆటంకం కలిగించవచ్చు. డైట్ ప్లాన్‌లో భాగంగా తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.

మజ్జిగ తాగేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు:
మధ్యాహ్నం సమయంలో మాత్రమే తాగడం మంచిది.
తక్కువ ఉప్పు, మసాలాలతో తీసుకోవాలి.
తాజాగా తయారు చేసిన మజ్జిగనే ఉపయోగించాలి.
ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి.

మజ్జిగ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రింక్ అయినప్పటికీ, ప్రతి ఒక్కరికీ మేలు చేయదు. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన విధంగా తీసుకుంటే.. మజ్జిగ వేసవిలో మీకు సహజ శక్తిని ఇస్తుంది. లేదంటే సమస్యలను కూడా తెచ్చిపెట్టే ప్రమాదం కూడా ఉంటుంది.

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×