E-Paper
Advertisement

గెట్ ఔట్.. నీ వల్లే ఈ ట్రాఫిక్ జామ్, మంత్రిని కడిగిపడేసిన మహిళ.. వీడియో వైరల్

గెట్ ఔట్.. నీ వల్లే ఈ ట్రాఫిక్ జామ్, మంత్రిని కడిగిపడేసిన మహిళ.. వీడియో వైరల్
Advertisement

Mumbai: ముంబై నడిరోడ్డుపై సామాన్య జనం పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు, సామాన్యుడి గొంతు ఎంత బలంగా ఉంటుందో నిరూపించింది. ముంబైలో బీజేపీ నిర్వహించిన ‘మహిళా సంకల్ప ర్యాలీ’ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ రద్దీలో చిక్కుకున్న ఒక సాధారణ మహిళ, మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌ను నేరుగా నిలదీసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

తన బిడ్డను స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తున్న ఆ మహిళ, గంటల తరబడి వాహనాల మధ్య ఇరుక్కుపోయింది. ఎండలో, కదలని ట్రాఫిక్‌లో తన బిడ్డ ఇబ్బంది పడుతుందన్న ఆవేదన ఆమెలో ఆగ్రహాన్ని నింపింది. సరిగ్గా అదే సమయంలో ర్యాలీలో పాల్గొన్న మంత్రి మహాజన్ ఆమెకు కనిపించడంతో.. ఏమాత్రం వెనకాడకుండా ఆయన వద్దకు వెళ్లి నిలదీసింది. ‘మీ రాజకీయ కార్యక్రమాలు, నిరసనలు ఏవైనా ఉంటే మైదానాల్లో (గ్రౌండ్స్) చూసుకోండి. ఇలా రోడ్ల మీద ర్యాలీలు తీసి సామాన్య ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు?’ అంటూ ఆమె వేసిన ప్రశ్నలకు మంత్రి ఒక్క క్షణం అవాక్కయ్యారు.

Advertisement

సాధారణంగా మంత్రులు కనిపిస్తే భయం భక్తి ప్రదర్శించే కాలంలో, ఒక మహిళ తన హక్కు కోసం, ఎదుటివారి నిర్లక్ష్యంపై విరుచుకుపడటం చర్చనీయాంశమైంది. వీఐపీ కల్చర్ పేరుతో సామాన్యుల సమయాన్ని వృధా చేసే నాయకులకు ఇదొక హెచ్చరిక లాంటిదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Also Read: అనగనగా ఓ సాఫ్ట్ వేర్.. ఉద్యోగం పోయిందని మేడపై గంజాయి మొక్కలు

Advertisement

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×