Table Fans 2026: ప్రస్తుతం ఫ్యాన్లలో చాలా రకాల మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. సీలింగ్, స్టాండ్, టేబుల్ ఇలా తమ అవసరానికి అనుగుణంగా విభిన్నశైలిలో ఇవి లభిస్తున్నాయి. అయితే వీటిలో టేబుల్ ఫ్యాన్లలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీటిని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఒక బల్ల లేదా అరుగుమీద పెట్టుకొని అహ్లాదకరమైన గాలిని అస్వాదించవచ్చు. 2026లో అత్యాధునిక టేబుల్ ఫ్యాన్లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ -3ని ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లపై ఓ లుక్కేయడి.
ఉషా కంపెనీకి చెందిన ఫ్యాన్లు.. ప్రతీ ఇంట్లో నమ్మకమైన వస్తువులుగా మారిపోయాయి. USHA Maxx Air Ultra టేబుల్ ఫ్యాన్ ను.. 2026లో మరింత అప్ గ్రేడ్ చేసుకొని తీసుకొచ్చింది. ఇందులో ‘థర్మల్ ఓవర్‌లోడ్ ప్రొటెక్టర్’ పొందుపరచడం వల్ల ఎక్కువ సేపు వాడినా మోటార్ వేడెక్కదు. 400mm స్వీప్, తక్కువ శబ్దం చేసే ఏరోడైనమిక్ బ్లేడ్లు దీనిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ధర విషయానికి వస్తే మార్కెట్ లో ఈ టేబుల్ ఫ్యాన్.. రూ.1,800 – 2,000 మధ్య సేల్ అవుతోంది.
తక్కువ సమయంలో గది అంతా చల్లటి గాలి నిండాలని భావిస్తే.. ఈ క్రాంప్టన కంపెనీకి చెందిన పవర్ ఫుల్ టేబుల్ ఫ్యాన్ ను ట్రై చేయవచ్చు. దీనిలోని మోటార్ పవర్ ఫుల్ గా ఉండటంతో పాటు గాలిని ఎక్కువ దూరం వరకు ప్రసారం చేస్తుంది. స్టైలిష్ లుక్, స్మూత్ ఆసిలేషన్ (ఇటు అటు తిరగడం) దీనిలోని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. పైగా ఇది చాలా తక్కువ శబ్దంతో పనిచేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఇది రూ.2,599కు సేల్ అవుతోంది.
కరెంటు ఆదాతో పాటు అత్యాధునిక ఫీచర్లు, తక్కువ శబ్దంతో రాత్రిళ్లు హాయిగా నిద్రపోవాలని భావిస్తే ఆటోంబర్గ్ రెనెసా ఫ్యాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ బీఎల్‌డీసీ (BLDC) మోటార్‌తో పనిచేస్తుంది, కాబట్టి సాధారణ ఫ్యాన్ల కంటే 65% తక్కువ కరెంటును ఉపయోగిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రిమోట్ కంట్రోల్, టైమర్, స్లీప్ మోడ్ వంటి అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లు సైతం ఇందులో ఉన్నాయి. ఈ ఫ్యాన్ రూ. 2,999కి అందుబాటులో ఉంది.
Also Read: పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్‌రావులకు స్మాల్ రిలీఫ్
ఆఫీసు, వంటగది, వ్యాపార సముదాయాల్లో వ్యక్తిగత టేబుల్ ఫ్యాన్ కోరుకుంటే ఇది చక్కటి ఎంపికగా నిలుస్తుంది. ఇది రీఛార్జబుల్ ఫ్యాన్. యూఎస్‌బీ (USB) సాయంతో దీనిని ఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు పోయినప్పుడు హాయిగా ఉపయోగించుకోవచ్చు. చిన్న సైజులో ఉండటం వల్ల ఎక్కడికైనా తెలిగ్గా తీసుకెళ్లే వీలుంటుంది. హై స్పీడ్ ఆపరేషన్, తుప్పు పట్టని గార్డ్స్ దీనిలో ప్రధాన ఫీచర్లుగా చెప్పవచ్చు. ఈ ఫ్యాన్ రూ.999-1500 మధ్య లభిస్తోంది.
Also Read: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నిహారిక రాకాస.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?