E-Paper
Advertisement

కాలీఫ్లవర్‌తో ఇలా వేపుడు చేయండి..రుచి చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

కాలీఫ్లవర్‌తో ఇలా వేపుడు చేయండి..రుచి చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!
Advertisement

Cauliflower fry recipe: మన వంటింట్లో ఉండే కూరగాయలలో కాలీఫ్లవర్‌కి ప్రత్యేక స్థానం ఉంది. దీంతో సూప్, మంచూరియా, కర్రీ వంటి వివిధ రకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే ..ఏ మాత్రం కష్టం లేకుండా, తక్కువ టైంలో ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ వేపుడు తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాలీఫ్లవర్‌తో ఈసారి ఇలా వేపుడు చేసి మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచండి.

కావలసిన పదార్థాలు:

కాలీఫ్లవర్ – 1 (చిన్న ముక్కలుగా తరిగినది)

Advertisement

ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)

పచ్చిమిర్చి – 3 లేదా 4

Advertisement

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

పసుపు – చిటికెడు

కారం – 1 స్పూన్ (రుచికి సరిపడా)

ధనియాల పొడి – 1 స్పూన్

గరం మసాలా – అర స్పూన్

ఉప్పు – తగినంత

కరివేపాకు – కొద్దిగా

కొత్తిమీర తరుగు – కొద్దిగా

నూనె – వేపుడుకు సరిపడా

తయారీ విధానం:

1.ముందుగా కాలిఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్‌లో చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేయాలి. ఆ నీటిలో కాలీఫ్లవర్ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత వాటిని వడ కట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాలీ ఫ్లవర్ శుభ్రపడటంతో.. పాటు, వండేటప్పుడు త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత నూనె వేసి వేడయ్యాక, కొద్దిగా ఆవాలు, జీల కర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత సన్నగా.. తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగు వచ్చే.. వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.

Also Read: అల్లం పచ్చడి ఇలా చేస్తే.. నెలల తరబడి నిల్వ ఉంటుంది,రుచి కూడా సూపర్!

2. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ప్యాన్‌లో వేయాలి. దాంతో పాటు చిటికెడు పసుపు , రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మంటను మీడియం సైజులో ఉంచి, మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నూనెలో కాలీఫ్లవర్ ముక్కలు కాస్త మెత్తబడే.. వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. కాలీఫ్లవర్ ముక్కలు సగం ఉడికిన తర్వాత, అందులో కారం, ధనియాల పొడి ,గరం మసాలా వేయాలి. మసాలాలు అన్నీ ముక్కలకు బాగా పట్టేలా.. గరిటెతో మెల్లగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టకుండా సన్నని మంటపై కాలీఫ్లవర్ క్రిస్పీగా మారే వరకు వేయించుకోవాలి. మధ్యలో కొద్దిగా నూనె చల్లుకుంటే వేపుడు మరింత రుచిగా వస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో ఈజీగా, తక్కువ సమయంలో తయారయ్యే ఈ కాలీఫ్లవర్ వేపుడు వేడి వేడి అన్నంలోకి, రసం లేదా పప్పు చారుతో అద్భుతంగా ఉంటుంది. అంతే కాదు చపాతీలు, రోటీలలోకి కూడా ఇది మంచి సైడ్ డిష్‌గా పని చేస్తుంది. ఈసారి మీ ఇంట్లో కాలిఫ్లవర్ ఉన్నప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేసి అందరి నుంచి శభాష్ అనిపించుకోండి!

Related News

అల్లం పచ్చడి ఇలా చేస్తే.. నెలల తరబడి నిల్వ ఉంటుంది,రుచి కూడా సూపర్!

ధనత్రయోదశి నాడు వీటిని ఇతరులకు ఇచ్చారో.. మీ ఇంట్లోని ఐశ్వర్యం తుడిచిపెట్టుకుపోతుంది!

రోజూ 7 గుడ్లు తింటూ 20 కిలోలు తగ్గానన్న యువకుడు.. కొలెస్ట్రాల్ రిపోర్ట్‌పై వైద్యుల వివరణ ఇదే!

దీపావళికి అదిరిపోయే స్టైలిష్ డ్రెస్ కావాలా.. ఈ ట్రెండీ అవుట్‌ఫిట్స్ ట్రై చేయండి

దీపావళికి మీ ఇంటి చిన్న పూజ గదిని అందంగా అలంకరించాలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరి

కష్టానికి తగిన ఫలితం దక్కకపోయినా బాధపడకండి.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే

రోజూ మీ భార్యతో ఫ్లర్టింగ్ చేస్తున్నారా? దాంపత్య జీవితంలో జరిగేది ఇదే..

Big Stories

Advertisement
×