E-Paper
Advertisement

అల్లం పచ్చడి ఇలా చేస్తే.. నెలల తరబడి నిల్వ ఉంటుంది,రుచి కూడా సూపర్!

అల్లం పచ్చడి ఇలా చేస్తే.. నెలల తరబడి నిల్వ ఉంటుంది,రుచి కూడా సూపర్!
Advertisement

Allam pachadi recipe: మన తెలుగు రాష్ట్రాల్లో అల్లం పచ్చడికి ఉండే క్రేజే వేరు. పెళ్లి భోజనాల దగ్గర నుంచి టిఫిన్లు, వేడి వేడి అన్నం ఇలా అన్నింటిలోకి అల్లం పచ్చడి పర్ఫెక్ట్ కాంబినేషన్. ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచడంలో, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో అల్లం ముందుంటుంది. మరి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా, అస్సలు చేదు రాకుండా పర్ఫెక్ట్ అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

అల్లం – 250 గ్రాములు (శుభ్రంగా కడిగి ఆరబెట్టి తరిగినది)

Advertisement

చింతపల్లి – 100 గ్రాములు (గింజలు లేనిది)

బెల్లం – 250 గ్రాములు (తురిమినది)

Advertisement

కారం – 50 గ్రాములు

ఉప్పు – తగినంత

మెంతులు – 1 స్పూన్

ఆవాలు – 1 స్పూన్

పసుపు – చిటికెడు

ఇంగువ – కొద్దిగా

నూనె – తాలింపుకు సరిపడా

తయారీ విధానం :

1. ముందుగా తాజా అల్లాన్ని తీసుకుని బాగా కడగాలి. తర్వాత తడి ఒక కాటన్ క్లాత్‌తో తుడిచి, ఆరబెట్టాలి. ఆ తర్వాత పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే.. చింతపండును కొద్దిగా వేడి నీటిలో నానబెట్టి, మెత్తగా గుజ్జులా తీసుకోవాలి. చింతపండులో.. ఎలాంటి నార లేదా పిక్కలు లేకుండా చూసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, మనం కట్ చేసి పెట్టుకున్న.. అల్లం ముక్కలను వేయాలి. అల్లం ముక్కలు పచ్చి వాసన పోయి, లైట్ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు మీడియం మంటపై వేయించుకోవాలి. అల్లం సరిగ్గా వేగితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చేదు కూడా రాదు. తర్వాత వేయించిన అల్లాన్ని చల్లారబెట్టాలి.

Also Read: స్వీట్ హౌస్ స్టైల్ బ్రెడ్ హల్వా..ఇంట్లోనే ఇలా టేస్టీగా రెడీ చేయండి

2. చల్లారిన అల్లం ముక్కలను మిక్సీ జార్‌లో వేయాలి. దీంతో పాటు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, బెల్లం తురుము, తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేయాలి. నీళ్లు అస్సలు కలపకుండా.. మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పచ్చడికి మంచి బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా ఎక్కువగానే నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు వేయించాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న అల్లం పచ్చడి పేస్ట్‌ను ఆ నూనెలో వేసి బాగా కలపాలి. పచ్చడిలో ఉన్న తడి అంతా ఇంకిపోయి, నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై ఉడికించాలి.

నిల్వ చేయడానికి చిట్కాలు:

ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. తడి తగలకుండా శుభ్రమైన, పొడి గరిటెను ఉపయోగిస్తే.. ఈ అల్లం పచ్చడి నెలల తరబడి పాడవకుండా ఎప్పుడూ ఒకే రుచి కలిగి ఉంటుంది.

ఎంతో రుచికరంగా, ఘాటుగా ఉండే.. ఈ అల్లం పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఆరోగ్యానికి ఎంతో.. మేలు చేసే ఈ పచ్చడి మీ భోజనానికి మంచి రుచిని తెస్తుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పచ్చడి ఎప్పటికీ చెడిపోదు కూడా!

Related News

కాలీఫ్లవర్‌తో ఇలా వేపుడు చేయండి..రుచి చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

ధనత్రయోదశి నాడు వీటిని ఇతరులకు ఇచ్చారో.. మీ ఇంట్లోని ఐశ్వర్యం తుడిచిపెట్టుకుపోతుంది!

రోజూ 7 గుడ్లు తింటూ 20 కిలోలు తగ్గానన్న యువకుడు.. కొలెస్ట్రాల్ రిపోర్ట్‌పై వైద్యుల వివరణ ఇదే!

దీపావళికి అదిరిపోయే స్టైలిష్ డ్రెస్ కావాలా.. ఈ ట్రెండీ అవుట్‌ఫిట్స్ ట్రై చేయండి

దీపావళికి మీ ఇంటి చిన్న పూజ గదిని అందంగా అలంకరించాలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరి

కష్టానికి తగిన ఫలితం దక్కకపోయినా బాధపడకండి.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే

రోజూ మీ భార్యతో ఫ్లర్టింగ్ చేస్తున్నారా? దాంపత్య జీవితంలో జరిగేది ఇదే..

Big Stories

Advertisement
×