E-Paper
Advertisement

మీ భార్యతో ఫ్లర్టింగ్ చేస్తున్నారా? దాంపత్య జీవితంలో జరిగేది ఇదే..

మీ భార్యతో ఫ్లర్టింగ్ చేస్తున్నారా? దాంపత్య జీవితంలో జరిగేది ఇదే..
Advertisement

Flirting With Partner | మీ భార్యను సంతోషపెట్టడానికి ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న సాయం చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పినా, లేదా ఆమెను పొగిడినా సరిపోతుంది. ఆమె చేసిన ప్రయత్నాన్ని గుర్తించి మెచ్చుకోవడం వల్ల ఆమె మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే భాగస్వామిని అభినందించడం వల్ల బంధం మెరుగుపడుతుందా? ఈ విషయంపై సైకాలజీ నిపుణులు అధ్యయనం చేశారు. వాటిలో వెల్లడైన ఆసక్తికర విషయాలు ఇవే..

మీ జీవిత భాగస్వామి ప్రయత్నాలను గుర్తించడం ఎందుకు ముఖ్యం?

కొత్తగా పెళ్లి జరిగినప్పుడు లేదా ప్రేమలో పడినప్పుడు మీ భాగస్వామి చేసే చిన్న పనులు కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తాయి. అయితే రోజులు గడిచేకొద్దీ వాటిని సాధారణ విషయాలుగా భావిస్తుంటాం. మీ సమస్యలను వినడం, ఇంటి పనుల్లో సాయం చేయడం, కష్టకాలంలో తోడుగా ఉండటం వంటివి అలవాటుగా మారిపోతాయి.
ఇలాంటి సమయంలో వారి ప్రయత్నాలను గుర్తించడం చాలా ముఖ్యం. మీరు వారిని గమనిస్తున్నారని, వారి శ్రమ, కష్టానికి విలువ ఇస్తున్నారని అప్పుడే భాగస్వామికి అనిపిస్తుంది. అలాగే ప్రశంసకు, కృతజ్ఞతకు మధ్య తేడా ఉంటుంది. అందంగా ఉన్నారని చెప్పడం ప్రశంస. మీ కోసం ఏదైనా చేసినప్పుడు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పడం కృతజ్ఞత.

2012 పరిశోధనలో ఏం తేలింది?

Advertisement

2012లో సైకాలజీ నిపుణురాలు అమీ గోర్డన్, ఆమె బృందం ప్రేమ సంబంధాల్లో కృతజ్ఞతపై పరిశోధనలు నిర్వహించారు. భాగస్వామి తమను గుర్తించి మెచ్చుకుంటున్నారని భావించినవారు, తిరిగి వారిని కూడా ఎక్కువగా అభినందిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు, భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడంలో కూడా వారు మెరుగ్గా స్పందించారు.

థ్యాంక్యూ చెప్పడం ఎందుకు ముఖ్యం?

2019లో యోబిన్ పార్క్, ఆమె బృందం 5 అధ్యయనాల ద్వారా కృతజ్ఞత ప్రభావాన్ని పరిశీలించారు. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో అభద్రత భావం ఉన్నవారిపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేశారు. భాగస్వామి నుంచి కృతజ్ఞత పొందినప్పుడు, కొందరిలో అభద్రతకు సంబంధించి కనిపించే ప్రతికూల ప్రభావాలు తగ్గినట్లు పరిశోధన సూచించింది. రిలేషన్‌షిప్‌లో సంతృప్తి, నిబద్ధతతో కూడా దీనికి సంబంధం కనిపించింది.

2023 పరిశోధన ఏం వెల్లడించింది?

Advertisement

2023లో యోబిన్ పార్క్, అమీ గోర్డన్ బృందం ఆరు దీర్ఘకాలిక డేటాసెట్లు పరిశీలించింది. ఇందులో 562 జంటలు, అంటే మొత్తం 1,124 మంది పాల్గొన్నారు. ఎక్కువ కృతజ్ఞత చూపినవారు తమ బంధంపై ఎక్కువ సంతృప్తి, నిబద్ధత కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఇద్దరూ సమానంగా కృతజ్ఞత చూపాల్సిన అవసరం లేదని కూడా తేలింది.

Also Read: రిలేషన్‌లో ప్రేమ, నమ్మకం పెరగాలంటే మీ భాగస్వామిని రోజూ ఈ 5 ప్రశ్నలు అడగండి

కేవలం ప్రశంసిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయా?

ప్రతిరోజూ భాగస్వామిని మెచ్చుకోవాలనే సైకాలజీ లేదా సైంటిఫిక్ రూల్ ఏదీ లేదు. నిజాయితీగా అభినందించడం ముఖ్యం. కేవలం అందాన్ని మాత్రమే కాకుండా, వారి సహనం, కష్టం, మంచితనాన్ని కూడా గుర్తించాలి.

అయితే ప్రశంసలతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. నమ్మకం, గౌరవం, మంచి సంభాషణ, పరస్పర సహకారం కూడా అవసరం. కాబట్టి చిన్న ప్రయత్నాలకైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. మీ మాటలతోపాటు చేతల్లోనూ ప్రేమను చూపించాలి. ఇలా భార్యాభర్తలు ఇరువురూ ప్రయత్నించాలి అప్పుడే దాంపత్యం జీవితం సజావుగా సాగింది.

Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు

Related News

స్వీట్ హౌస్ స్టైల్ బ్రెడ్ హల్వా..ఇంట్లోనే ఇలా టేస్టీగా రెడీ చేయండి

చీజ్ లవర్స్‌కు తప్పకుండా నచ్చే ‘ఎగ్‌ప్లాంట్ పార్మిజియానా’.. లొట్టలేసుకుంటూ తినడం ఖాయం!

బండ్ల మీద దొరికే పెసర పునుగుల సీక్రెట్ ఇదే..స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇక మీ ఇంట్లోనే!

సొరకాయ పచ్చి కారం కూర ఇలా చేస్తే..ఒక్క ముద్ద కూడా వదలరు!

ఐస్‌క్రీమ్‌ను ఇలా కూడా తయారుచేయొచ్చా? ఈ జపనీస్ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

సింపుల్‌గా హైదరాబాదీ రాయల్ మటన్ మరగ్.. ఇంటికొచ్చిన అతిథులు ముగ్దులైపోవాల్సిందే!

డిప్రెషన్, స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలా? ఈ 5 జపాన్ టెక్నిక్స్ మీ కోసమే

Big Stories

Advertisement
×