Kothapatnam Beach: ప్రకాశం జిల్లా కొత్త పట్నం బీచ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉదయం తీరానికి ఓ మత్స్యకార బోటు కొట్టుకు రాగా అందులో 4 మృతదేహాలు ఉండటం తీవ్ర కలకలం రేపింది. అయితే అందులో సుమారు 15 మంది మత్స్యకారులు ఉండే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. బోటు మురసు తుఫాన్ లో చిక్కుకొని తిరగబడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మిగిలిన వారి ఆచూకీపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తీరానికి కొట్టుకొచ్చిన బోటు చెన్నైకి చెందినదిగా భావిస్తున్నారు. బోటులో మెుత్తం 12 మంది ఉండగా.. వారం క్రితం దాని ఆచూకీ సముద్రంలో గల్లంతైనట్లుగా తెలుస్తోంది. మరో ఎనిమిది మంది కోసం తీరం వెంబడి గాలింపు చర్యలను అధికారులు చేపట్టారు. మరోవైపు బోటును ఒడ్డుకు తీసుకువచ్చేందుకు కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
#AP: Four bodies wash ashore at #Kothapatnam beach in #Prakasam #district 12 #TamilNadu #fishermen went missing a week ago after venturing into the sea for fishing, #APPolice suspect their #boat may have capsized amid rough sea conditions caused by the #cyclone #Missing #Arnab https://t.co/znqr12KEKY
— Dandhavolu S Giri (@girizoom) November 5, 2026
Also Read: కాఫీ తాగడానికి వస్తున్నారా? లేక ఆఫీస్ రన్ చేస్తున్నారా? వైరల్ అవుతున్న కెఫే కష్టాలు!
మరోవైపు బోటు కొట్టుకొచ్చిన ఘటనపై మంత్రి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పందించారు. జిల్లా అధికారులతో కలిసి తమిళనాడు ప్రభుత్వంలో సంప్రదింపులు జరిపారు. బోటులో ఇంకెవరైనా ఉన్నరన్న దానిపై అవసరమైతే రెస్క్యూ ఆపరేషన్ చేపడతామని మంత్రి అన్నారు. ఈ ఘటన ఎంతో బాధకారమన్న మంత్రి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read: రోజూ 7 గుడ్లు తింటూ 20 కిలోలు తగ్గానన్న యువకుడు.. కొలెస్ట్రాల్ రిపోర్ట్‌పై వైద్యుల వివరణ ఇదే!